తెలంగాణ సచివాలయం కూల్చివేతపై ఈ నెల 15 వరకు స్టేను పొడిగిస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. కొత్త సచివాయం నిర్మాణం కోసం ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. గత వారం ప్రభుత్వం సచివాలయ భవానాల కూల్చివేతను ప్రారంభించింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారణ జరిపిన న్యాయస్థానం కూల్చివేతపై సోమవారం వరకు స్టే విధించగా.. ఇప్పుడు దాన్ని 15వ తేదీ వరకు పొడిగించింది.
సచివాలయ కూల్చివేత స్టే పొడగింపు

Related tags :