Politics

ఆత్మహత్యకు ప్రయత్నించిన నళిని

ఆత్మహత్యకు ప్రయత్నించిన నళిని

మాజీ ప్రధానమంత్రి రాజీవ్​గాంధీ హత్య కేసులో దోషి నళిని శ్రీహరన్​ ఆత్మహత్యాయత్నం చేసింది.

తమిళనాడు వేలూరులోని జైలు సిబ్బందితో వాగ్వాదం జరిగిన క్రమంలో గొంతు కోసుకునే ప్రయత్నం చేసింది.

దివంగత ప్రధానమంత్రి రాజీవ్​గాంధీ హత్య కేసు దోషి నళిని శ్రీహరన్​ ఆత్మహత్యాయత్నం చేసింది.

జీవిత ఖైదు పడిన నళిని ప్రస్తుతం తమిళనాడు వేలూరు తోరప్పాడి మహిళా కారాగారంలో 29 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తోంది.

29 సంవత్సరాలలో నళిని ఆత్యహత్యాయత్నం చేయటం ఇదే తొలిసారని, గతంలో ఎన్నడూ ఇలాంటి ప్రయత్నం చేయలేదని తెలిపారు న్యాయవాది.

1991, మేలో తమిళనాడులో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీని ఆత్మాహుతి దాడి ద్వారా హత్య చేశారు.

ఈ కేసులో నళిని భర్తతో పాటు మొత్తం ఏడుగురు దోషులుగా తేలారు. వారందరికి మరణశిక్ష పడగా.. ఆ తర్వాత దానిని జీవిత ఖైదుగా మార్చారు.