Movies

నేడు కోడి రామకృష్ణ జయంతి

Remembering The Legacy Of Veteran Director Kodi Ramakrishna

కోడి రామకృష్ణ తెలుగు సినిమా దర్శకుడు. రామకృష్ణ పాలకొల్లులో జన్మించారు. పాలకొల్లులోని లలిత కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేసాడు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకునిగా తన కెరీర్ ప్రారంభించి పలు చిత్రాలకు దర్శత్వం వహించారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రకథా నాయకులందరితో ఆయన సినిమాలు చేశాడు.
పుట్టిన తేదీ: 23 జులై, 1949
పుట్టిన స్థలం: పాలకొల్లు
మరణించిన తేదీ: 22 ఫిబ్రవరి, 2019
మరణించిన స్థలం: ఏ ఐ జి హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్

కోడి రామకృష్ణ మొదటి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. కోడి రామకృష్ణకి చిరంజీవితో ఉన్న అనుబంధం గురించి కొత్త‌గా చెప్ప‌డానికి లేదు. ఎందుకంటే ఆయ‌న ద‌ర్శ‌కుడిగా మారిందే చిరు సినిమాతో. 1982లో ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య సినిమాతో ఈయ‌న మెగాఫోన్ ప‌ట్టుకున్నాడు. అప్ప‌టికి అంతగా ఇమేజ్ లేని చిరంజీవి అయితే ప్రేక్ష‌కులు కూడా కొత్త‌గా ఫీల్ అవుతార‌ని భావించి త‌న‌ కథకు చిరంజీవి ఒక్క‌డే సరిపోతాడని పట్టుబట్టి మ‌రి నిర్మాత రాఘవని కన్విన్స్ చేసి తొలి సినిమాను ఒప్పించుకున్నారట. ఈ సినిమా ఏకంగా 525 రోజులు ఆడింది. సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. నేడు కోడి రామకృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమాలోని కొన్ని పాటలు ఆస్వాదిద్దాం.

ఒక వనిత నవ ముదిత
వచ్చే వచ్చే వయసు జల్లు
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
సీతారాముల ఆదర్శం
పలికేది వేద మంత్రం

ఆ త‌ర్వాత గూడాచారి నెం.1, ఆల‌య శిఖ‌రం, సింహ‌పురి సింహం, రిక్షావోడు, అంజి లాంటి సినిమాలు చిరంజీవి గారితో తెర‌కెక్కించాడు కోడి రామ‌కృష్ణ‌.