Movies

అత్యద్భుత చిత్రం…మహామంత్రి తిమ్మరుసు

Mahamantri Timmarusu Release Anniversary - Special Focus

1962లో విడుదల అయిన అద్భుత చారిత్రాత్మక చిత్రం “మహామంత్రి తిమ్మరుసు”. అమర గాయకులు శ్రీ  ఘంటసాల గారు పాడిన ఎన్నో ఆణి ముత్యాల వంటి యుగళ గీతాలలో శ్రీమతి పి. లీల గారితో పాడిన “జయవాణీ చరణ కమల సన్నిధి మన సాధనా..” అన్న ఈ పాట చెప్పుకోదగినది. ఈ పాట  శ్రీకృష్ణ దేవరాయలు (NTR) మరియు చిన్నా దేవి (ఎల్. విజయలక్ష్మి) మీద చిత్రీకరించబడింది. అయితే ఈ పాటలో ఒక సాంకేతిక లోపం ఉంది. అదేమిటంటే, రామారావు గారు వాయించే వాయిద్యం చేత్తో వాయించే సరస్వతీ వీణ కాదు. దీనిని చిత్ర వీణ లేదా గొట్టు వాయిద్యం అంటారు. దీనికి మెట్లు ఉండవు. దీనిని ఒక కర్రతో వీణ పైభాగం లో తంత్రులను తాకుతూ వాయిస్తారు. సాధారణంగా పాత తెలుగు చిత్రాలలో వీలైనంత జాగ్రత్తలు తీసుకుని సహజంగా కనిపించేలా చిత్రీకరిస్తుంటారు. కాని ఈ సినిమా విషయంలో ఈ పొరపాటు జరిగింది. అయితే చెబితేకాని తెలియదనుకోండి. ఏది ఏమైనా, ఈ యుగళగీతం మాస్టారు పాడిన వాటిలో మెచ్చుకోదగినది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఇందులో తిమ్మరుసు గా నటించిన శ్రీ గుమ్మడి వెంకటేశ్వర రావు గారికి ఉత్తమ సహాయ నటుడు గా జాతీయ పురస్కారం లభించింది.  ఇది వారి చలన చిత్ర జీవితంలో ఒక చిరస్మరణీయమైన పాత్ర.