DailyDose

మొద్దు శీను హంతకుడు ఓంప్రకాశ్ మృతి-నేరవార్తలు

మొద్దు శీను హంతకుడు ఓంప్రకాశ్ మృతి-నేరవార్తలు

* మొద్దు శ్రీను హత్య కేసులో దోషి ఓం ప్రకాష్ సోమవారం నాడు కేజీహెచ్‌ ఆసుపత్రిలో మృతి చెందాడుటీడీపీ నేత పరిటాల రవి కేసులో దోషి మొద్దు శ్రీను హత్య కేసులో నిందితుడు ఓం ప్రకాష్ మరణించాడు. విశాఖపట్నంలోని కేజీహెచ్ లో చికిత్స పొందుతూ అతను మరణించాడు. గత కొంత కాలంగా అతను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు.మొద్దు శ్రీనును ఓం ప్రకాష్ జైలులోనే చంపాడు. 2016 నుంచి ఓంప్రకాష్ విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఉంటున్నాడు.

* మన్యంలో మావోయిస్టులు కదలికలు మరియు వరుస ఎదురుకాల్పులు మరింత పెరిగిన తనిఖీలుఈ నెల 28 నుండి ఆగెస్ట్ 3 వరకు మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలుకు పిలుపునిచ్చారు. దీనితో తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్న పోలీసులు,చింతపల్లి. జి. కె.వీధి రహదారి వెంబడి ఉన్న కల్వర్ట్ మరియు ఇతర ముఖ్యమైన కూడళ్లలో BD టీమ్ తో CRPF బలగాలతో క్షుణ్ణంగా తనిఖీలు. భయాందోళనలో గిరిజనులు.

* వారధి వద్ద భారీ మొత్తంలో తెలంగాణ మద్యం స్వాధీనం చేసుకున్న తాడేపల్లి పోలీసులు..తెలంగాణ నుంచి తాడేపల్లి పరిసర ప్రాంతాలకు మద్యం తరలిస్తున్న లారీని పట్టుకున్న పోలీసులు.6 లక్షల విలువ చేసే 32 కేసుల తెలంగాణ మద్యం స్వాధీనం..తెలంగాణకు చెందిన 4 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

* చెన్నై పోలీసులు, ఐటీ అధికారులను వివరాలు కోరిన ఈడీతమిళనాడులో పట్టుబడిన రూ.5 కోట్లపై విచారణకు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్ రంగంలోకి దిగింది.చెన్నై పోలీసులు, ఐటీ అధికారులను ఈడీ వివరాలను కోరింది.అన్నా రాంబాబు స్టిక్కర్‌ ఉన్న కారులో పట్టుబడిన నగదు ఎక్కణ్నుంచి వచ్చాయోనని ఐటీ ఆరా తీస్తోంది. చెన్నైలో ఎవరికి ఇచ్చేందుకు నగదు తీసుకెళ్తున్నారన్న అంశంపై విచారిస్తున్నారు.  ​    ఎమ్మెల్యే అన్నా రాంబాబు కోడ్​ నంబర్​తో స్టిక్కర్​తో ఉన్న కారులో 5 కోట్ల రూపాయల నగదు చెన్నైలో చిక్కింది.ఒంగోలుకు చెందిన వ్యాపారి ఈ నగదుతో పోలీసులకు చిక్కాడు.ఒంగోలు నుంచి చెన్నై వెళ్తున్న కారులో చెక్​పోస్టు వద్ద చేసిన తనిఖీల్లో ఈ నగదు చిక్కింది.ఈ నగదు ఎవరిది అనే అంశంపై కొన్ని రోజుల క్రితం తీవ్ర సంచలనమైంది.  

* మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.బెయిల్‌ పిటిషన్‌పై ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.ఈ నెల 29 న తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

* ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావుకు అస్వస్థత. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు అస్వస్థతకు గురయ్యారు.బీపీ, ఛాతీలో నొప్పి రావడం వల్ల ఆదివారం రాత్రి అదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు.మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.ఎంపీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది.  

* ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డికి తన భాదలతో నాలుగు పేజీలు లేఖ వ్రాసిన యువకుడుపైనాన్షియర్లు వేధింపులు తట్టుకోలేక ఆత్మహాత్య చేసుకున్న శివమల్లేశ్వరావుమృతుడుది పమిడిముక్కుల మండలం ముళ్లపూడి గ్రామస్ధుడుశ్రీరామ్ ట్రాన్సఫోర్టు మేనేజర్ సుధాకర్ వేధింపులు పై ఆవేదనసంధీప్, నాగరాజు శివ చింతయ్యల దగ్గర తీసుకున్న మొత్తానికి పదిరెట్లు చెల్లించినా వేధిస్తున్నారునా చావుతో ట్రాన్సపోర్టు ఆపరేటర్లకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానునా ఈలెటర్ సిఎం గారు దృష్టికి తీసుకెళ్లమని ఉయ్యూరు పోలీసులను వేడుకున్న మృతుడు

* కరోనా మన దేశంలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే భారత్ లో 14 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా 32 వేలకు పైగా మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. అయితే కరోనా మనుషులనే కాదు సమాజం లోని మానవత్వాన్ని కూడా చంపేస్తుంది అనడానికి ఈ సంఘటన ఉదాహరణ. పశ్చిమ గోదావరి ఆకివీడు మండలం భీమవరం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆ ఊరి బస్టాప్ లో రెండు రోజుల నుంచి అనారోగ్యంతో ఓ వ్యక్తి భాధపడుతున్నాడు. అయితే కరోనా వైరస్ భయంతో ఎవరూ అతని దగ్గరికి కూడా వెళ్ళలేదు. 108 కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అంబులెన్స్ రాకపోవడంతో ప్రైవేట్ అంబులెన్సులకు కూడా ఫోన్ చేసారు. కానీ వారు కుడా స్పందించలేదు. ఇక చివరికి చెత్త బండిలో ఆకివీడు ప్రభుత్వాసుపత్రికి ఆ వ్యక్తిని తరలించారు.