Movies

కల్పనతో కోరిక తీర్చుకోవాలని..

Vani Kapoor's Dream Biopic Projects

నటీనటులకు కెరీర్‌ పరంగా వారికంటూ కొన్ని ఆశలుంటాయి. పౌరాణిక పాత్ర చేయాలి.. విలన్‌ ఛాయలున్న పాత్రలు చేయాలి.. బయోపిక్స్‌లో నటించాలని కోరుకుంటారు. అలాగే బాలీవుడ్‌ నటి వాణీ కపూర్‌కి కూడా ఒకరి బయోపిక్‌లో నటించాలనే కోరిక ఉందట. తొలి సినిమా ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’తో వాణీ కపూర్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకుంది. బాలీవుడ్‌లో మూడు, కోలీవుడ్‌లో ఒకటి మొత్తం కలిపి చేసింది నాలుగు సినిమాలే అయినా సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు చిత్రాలున్నాయి. అయితే దివంగత వ్యోమగామి కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించాలని ఉందంటూ తాజాగా ఆమె తన కోరికను బయటపెట్టింది.