DailyDose

ముంబయిలో ₹1000కోట్ల మాదకద్రవ్యాలు పట్టివేత-నేరవార్తలు

ముంబయిలో ₹1000కోట్ల మాదకద్రవ్యాలు పట్టివేత-నేరవార్తలు

* సెల్‌ఫోన్లు ఈ మధ్య చాలా ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా.. తమిళనాడులో సెల్ ఫోన్ వల్ల ఓ విషాదం చోటుచేసుకుంది. సెల్ ఫోన్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయిన ఘటన కరూర్ జిల్లాలో చోటు చేసుకుంది. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి ఇద్దరు పిల్లలతో కలిసి ముత్తులక్ష్మీ అనే మహిళ నిద్రలోకి జారుకుంది. అయితే ప్రమాదవశాత్తు ఆ సెల్‌ఫోన్ పేలిపోవడంతో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో మంటలు వ్యాప్తి చెందడటంతో ముత్తులక్ష్మీతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు రంజిత్, దక్షిత్ మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

* నకిలీ ఐఏఎస్ అరెస్ట్- రిటైర్డ్ ఐఏఎస్, ఏపీ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సంస్కరణల కమిటీ చైర్మన్ కె.సుజాతరావు పేరుతో మోసాలకు పాల్పడుతున్న మహిళ- కీలాడీ మహిళ విజయవాడకు చెందిన పెమ్మడి విజయలక్ష్మీ అరెస్ట్

* బెయిల్‍పై విడుదలైన జేసీ ప్రభాకర్‍రెడ్డిని పోలీసులతో వాగ్వివాదానికి దిగారని మళ్లీ రిమాండ్‍కు తరలించారు- పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలను అణగదొక్కాలని వైసీపీ చూస్తోంది- ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతున్న ప్రతిపక్షాలపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు- రోడ్లపై పడి ఉరేగింపులు చేసిన ఎమ్మెల్యే రోజా, మధుసూదన్ రెడ్డిలపై కేసులు లేవు.. కనీసం పట్టించుకోలేదు- గుంటూరులో ఓ మైనార్టీ వ్యక్తిని సీఐ దుర్భాషలాడిన ఘటనపై ఎలాంటి చర్యలు లేవు- సీతానగరంలో ఇసుక తరలింపునకు అడ్డుకున్న యువకుడికి పోలీసులే శిరోముండనం చేయిస్తే ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది :మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప

* రూ.1000 కోట్ల విలువైన డ్రగ్స్​ పట్టివేత.ముంబయిలో పెద్తఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి.నవీ ముంబయిలోని పోర్టులో 191 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.1000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.ముంబయిలో ఈ స్థాయిలో డ్రగ్స్​ పట్టుబడటం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. వీటిని సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను ముంబయి డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు.ఈ మాదకద్రవ్యాలను అఫ్ఘానిస్థాన్ నుంచి ముంబయికి తీసుకొచ్చినట్లు గుర్తించారు. ప్లాస్టిక్‌ పైపుల లోపల అమర్చిన ఈ మాదక ద్రవ్యాలను ఇరాన్‌ మీదుగా ఇక్కడకు తరలించినట్లు తెలిపారు. అయితే, పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు వెదురుబొంగులు వలే కనిపించే విధంగా ప్లాస్టిక్‌ పైపులకు రంగులను పూసినట్లు అధికారులు వెల్లడించారు.