Kids

పిల్లలకు కలర్ థెరపీ

పిల్లలకు కలర్ థెరపీ

వైద్యరంగంలో కొన్ని కొన్ని థెరపీలున్నాయి. వాటిలో ఒకటి కలర్ థెరపీ. కలర్ థెరపీ భౌతిక, మానసిక, ఉద్వేగపరమైన సమస్యలను దూరం చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. జీవితాన్ని రంగులమయం చేసుకోవాలంటారు పెద్దలు. ఇంద్రధనస్సుతో పోలుస్తుంటారు. మానసిక స్వాంతన కలిగించేందుకు ఈ రంగులు ఎంతో ఉపయోగపడతాయి. కలర్ థెరపీ ఈజిప్టులో పుట్టినట్లు , ప్రాచీన కాలంలో ఈ థెరపీని ఉపయోగించినట్టు పరిశోధకులు చెబుతున్నారు. రంగులు, వెలుగుపై విస్తృతంగా పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఇటువంటి అధ్యయనాల ద్వారా రంగులు వ్యక్తుల్లో భావోద్వేగమైన ప్రతిస్పందనలు కలిగిస్తాయనీ, ఒక రంగు పట్ల అందరి స్పందన ఒకేలా ఉండదనీ తెలుసుకున్నారు. కొన్ని రంగులు సానుకూల భావాలను, కొన్ని రంగులు ప్రతికూల భావాలను కలిగిస్తాయి. వీటిపై అధ్యయనం చేసినవారే కలర్ థెరపీ చేస్తారు. మనం ఎంచుకునే రంగులు కూడా మన వ్యక్తిత్వాన్ని కొంత వరకు వ్యక్తపరుస్తాయి. కొన్ని రకాల రంగుల దుస్తులు మన మూడ్‌ను కూడా ప్రభావితం చేస్తాయి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలనే కలర్ థెరపిస్టులు వెల్లడిస్తున్నారు. అనేక అనారోగ్యాల నుంచి బయటపడేందుకు వైద్యరంగంలో కొన్ని కొన్ని థెరపీలున్నాయి. వాటిలో ఒకటి కలర్ థెరపీ. కలర్ థెరపీ భౌతిక, మానసిక, ఉద్వేగపరమైన సమస్యలను దూరం చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. పసుపు పచ్చ : మానసిక ఉత్తేజాన్ని కలిగించే రంగు ఇది. సానుకూల వైఖరి, ఆత్మగౌరవం, వివేకం, స్ఫూర్తికి సంకేతం. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడం, ఆందోళన నుంచి బయటపడటం వంటివి ఈ రంగు వల్ల సాధ్యం అవుతుందంటున్నారు థెరఫిస్టులు. ఆకుపచ్చ: నూతనోత్సాహాన్ని, శాంతినిచ్చే రంగు. ప్రేమ, ఆశ, సామరస్యం, స్వీయ నియంత్రణ వంటి అంశాలకు సంకేతం. ఆకుపచ్చ రంగు ఒత్తిడిని తగ్గించి మానసిక శారీరక విశ్రాంతిని కలిగిస్తుంది. అలాగని అతిగా వాడితే బద్ధకం బద్ధకస్తులవుతారట. లేత *నీల౦
ప్రశాంతతకు చిహ్నం. భావవ్యక్తీకరణకు సంకేతం. స్వచ్ఛత, ఓదార్పు, ఆత్మవిశ్వాసం, అనర్గళంగా, నిర్మొహమాటంగా మాట్లాడటం వంటి లక్షణాలు ఈ రంగు వల్ల పెరుగుతాయట. ఈ రంగును ఎక్కువగా వాడినా ఎలాంటి దుష్రభావాలకూ లోనుకాము.నీలం
సంపూర్ణ ఆలోచనలతో అనుసంధానం అయి ఉండే రంగు. సృజనాత్మకత, వ్యక్తీకరణ, ఉత్తేజం, ఆరోగ్యం వంటి లక్షణాలకు సంకేతం. పిల్లల్లో హైపర్ యాక్టివ్ తగ్గేందుకూ సహాయపడుతుంది. అందుకనే చాలా పాఠశాలల్లో నీలం రంగు యూనిఫామ్ ఉపయోగిస్తారు. అతిగా వాడితే అభద్రత, నిరాశ, అలసట, ఉదాసీనత ఏర్పడవచ్చు. వంకాయ రంగు: ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని సూచించేది. స్ఫూర్తి, సృజనాత్మకత, అందం వంటి వాటికీ అనుసంధానంగా ఉంటుంది. గాఢనిద్ర, చిరాకు, అతి ఆకలి తగ్గడానికి మంచి మందు ఈ రంగు. అతిగా వాడితే ఉద్వేగాలను ఆపుకోలేకపోవడం వంటి లక్షణాలు పెరుగుతాయట. *మెజెంటా
ఓదార్పు, సున్నితత్వం వంటి భావాలతో అనుసంధానమై ఉంటుంది. ఈ రంగును వాడటం వల్ల అంతర్గత, బహిర్గత ఉద్వేగాలు సమతౌల్యం చేసుకోగలుగుతారు. నలుగురితో కలవలేని వారికి, డిప్రెషన్‌లో ఉన్నవారికి ఈ రంగు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. *పసుపు
ఉత్తేజాన్నిచ్చే రంగు. ధైర్యం, బలం, ఉల్లాసం, లక్ష్యం, అప్రమత్తత, లైంగిక, సృజనాత్మక వంటి లక్షణాలకు ఎరుపు రంగు సంకేతం. ఆకలిని పెంచే రంగు. ఎక్కువగా ఉపయోగిస్తే అసహనం, శతృత్వ భావన, చిరాకు వంటి లక్షణాలు పెరుగుతాయి. నారింజ రంగు: మానసిక ఉద్వేగాలను ప్రభావితం చేయగలదు. కలుపుగోలుతనం, విశ్వాసంగా ఉండటం, సంతోషం, విజయం వెంటే ఉండేలా ప్రభావితం చేస్తుంది. యాంటీ డిప్రెసెంట్‌గా కూడా పనిచేస్తుంది. అతిగా వాడే వారిలో అసహనం, చిరాకు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.