NRI-NRT

విజయవంతంగా ఆటా “ఝుమ్మంది నాదం” ఫైనల్స్

విజయవంతంగా ఆటా “ఝుమ్మంది నాదం” ఫైనల్స్

అమెరికా తెలుగు సంఘం(ఆటా) “ఝుమ్మంది నాదం” శాస్త్రీయ, సినీ సంగీత పాటల పోటీలను 8,9 తేదీల్లో జూమ్ ద్వారా నిర్వహించారు. 71 మంది గాయని గాయకులు అమెరికా నలుమూలల నుండి ఆసక్తితో పాల్గొన్నారు. BoT రామకృష్ణారెడ్డి, కార్యక్రమ ఛైర్మెన్ శారదా సింగిరెడ్డి నిర్వాహకులుగా వ్యవహరించారు. సంగీత దర్శకులు రాజశేఖర్ సూరిభొట్ల, నిహాల్ కొండూరి, శ్రీని ప్రభల, కర్నాటిక్ మ్యూజిక్ వోకలిస్ట్ టికె.సరోజ, సునీల్ కశ్యప్, సినీనటి లయ న్యాయ నిర్ణేతలుగా వ్యవహిరించారు. శాస్త్రీయ సంగీతంలో సబ్ జూనియర్స్ క్యాటగిరిలో వైష్ణవి రెండుచింతల ప్రథమ, పర్ణిక ఉల్లంగి ద్వితీయం, జూనియర్స్ క్యాటగిరిలో శశాంక ఎస్ యెన్ ప్రథమ, హైందవి వెళదండ ద్వితీయం, సీనియర్స్ క్యాటగిరిలో అపరాజిత పమిడిముక్కల ప్రథమం, సిరి వడ్డిపర్తి ద్వితీయం, సినీ సంగీతంలో సబ్ జూనియర్స్ క్యాటగిరిలో మహి ఓత్ర ప్రథమం, వైష్ణవి రెండుచింతల ద్వితీయం, జూనియర్స్ క్యాటగిరిలో అదితి నటరాజన్ ప్రథమం, ఆదిత్య కార్తీక్ ఉపాధ్యాయుల ద్వితీయం, సీనియర్స్ క్యాటగిరిలో మైన ఈదుల ప్రథమం, అపరాజిత పమిడిముక్కాల ద్వితీయ స్థానాల్లో నిలిచారు. ఆటా అధ్యక్షుడు భీమిరెడ్డి పరమేశ్, ఆటా తదుపరి అధ్యక్షుడు భువనేశ్ రెడ్డి భుజాలలు విజేతలకు అభినందనలు అందజేశారు.