DailyDose

ఏపీలో నేడు 9742 కేసులు-TNI బులెటిన్

ఏపీలో నేడు 9742 కేసులు-TNI బులెటిన్

* ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఆందోళన వ్యక్తం చేశారు.కరోనా కట్టడిలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ….‘‘3,06,261 కేసులు, 2820 మరణాలు. దేశంలో మూడులక్షలు దాటిన మూడో రాష్ట్రంగా రికార్డు.11 రోజుల్లోనే మూడో లక్ష కూడా, కేసుల పెరుగుదలలో మొదటిస్థానం.దేశంలో 10వేల కేసులు దాటిన 50 జిల్లాలలో 13 మనవే.కరోనా వారియర్స్‌తో మాట్లాడి ప్రజలకు మనోధైర్యం కల్పించాలన్న చంద్రబాబు మాటలు మీకు వినబడుతున్నాయా? జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు.

* ఏపిలో గత 24 గంటల్లో 9742 కరోనా పాజిటివ్ కేసులు, 86 మరణాలు. 30 లక్షలు దాటిన టెస్టులు.

* మెడికల్ ఫిట్‌నెస్ మార్గదర్శకాలు

ఇది తెలుసుకోవలసిన చాలా ముఖ్యమైన సమాచారం మరియు తప్పనిసరి.
రక్తపోటు
————-
120/80 – సాధారణం
130/85 – సాధారణ (నియంత్రణ)
140/90 – అధికం
150/95 – వి.హై
—————————-
తక్కువ బిపి
———
120/80 – సాధారణం
110/75 – సాధారణ (నియంత్రణ)
100/70 – తక్కువ
90 // 65 – ప్రమాదకరమైనది

హిమోగ్లోబిన్
——————-
మగ – 13 — 17
ఆడ – 12 — 15
—————————-
పల్స్
——–
నిమిషానికి 72 (ప్రామాణికం)
60 — 80 ప్.ం. (సాధారణ)
81– 180 ప్.ం. (అసాధారణ)
—————————-
చల్లదనం
—————–
37.0 సెల్ (సాధారణం)
37.5 సెల్ పైన (జ్వరం)

*  కరోనావైరస్‌ బారిన పడి కోలుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను మంగళవారం మధ్యాహ్నం అఖిల భారత వైద్యవిజ్ఞాన శాస్త్రాల సంస్థ- ఎయిమ్స్‌కు తరలించారు. విపరీతమైన అలుపు, ఆయాసం, ఒంటి నొప్పులతో గత మూడు రోజులుగా బాధపడుతున్నట్లు ఆయన చెప్పడంతో ప్రస్తుతం చికిత్స చేస్తున్న గుర్గాంలోని ఆస్పత్రి నుంచి ఎయిమ్స్‌కు మార్చారు. కొవిడ్‌ నుంచి బయటపడి డిశ్ఛార్జి అవుతారనుకున్న దశలో ఆయనకు ఈ కొత్త సమస్యలు చుట్టుముట్టాయి. ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని, కరోనా-తదనంతర సమస్యలకు చికిత్స చేస్తున్నామని, ఆసుపత్రి నుంచే ఆయన విధులు కూడా నిర్వర్తిస్తున్నారని ఎయిమ్స్‌ ఓ బులెటిన్‌లో తెలియజేసింది. 

* తెలంగాణ కొరొనా హెల్త్ బులిటెన్ విడుదలగడిచిన 24 గంటల్లో 1763 కొరొనా పాజిటివ్ కేసులు నమోదుకొత్తగా 8 మరణాలు– మొత్తం 719కి చేరిన మరణాల సంఖ్య. GHMC-484, మేడ్చెల్-169, కరీంనగర్- 53, వరంగల్ అర్బన్-88, రంగరెడ్డి-166, కామారెడ్డి- 63, జగిత్యాల్- 61, నల్గొండ 65, కేసులు నమోదుకొత్తగా కొలుకున్నది-1789–ఇప్పటి కొలుకున్నవారి సంఖ్య-73 991 ఉన్నట్లు వెల్లడిప్రస్తుతం ఆక్టీవ్ కేసులు- 20 990 –ఇప్పటి వరకు నమోదైన కొరొనా పాజిటివ్ కేసుల సంఖ్య- 95 700 చేరినట్లు వైద్యశాఖ ప్రకటన