Food

సాంప్రదాయ భోజనమే ద బెస్ట్

సాంప్రదాయ భోజనమే ద బెస్ట్

ప్రపంచంలో ప్రతి ముగ్గురి లోనూ ఒకళ్లు స్థూలకాయులుగా ఉన్నారని పరిశోధనలో తేల్చారు. ఈ అధికబరువు, స్థూలకాయం పాతికేళ్లు వాళ్లనే పట్టిపీడిస్తోంది. దీనివల్ల మానవ వనరులు ప్రమాదంలో పడుతున్నాయని ముందు నుంచే జాగ్రత్త పడకపోతే భవిష్యత్ కాలంలో ఆరోగ్యం లేకపోవటం, ఆకస్మిక మరణాలు చోటు చేసుకుంటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ భారీకాయుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ విడుదల చేసిన డేటా ప్రకారం 2014లో 3.7 శాతంగా ఉంటే 2025 నాటికి ఇంకా ఐదుశాతం కచ్చితంగా పెరుగుతుంది. భారతదేశంలో ఈ సమస్య మరీ ఎక్కువగా లెక్కతేలుతుంది. స్థూలకాయంవల్ల వచ్చే సకల వ్యాధులూ సమాజంలో ప్రబలి పోతున్నాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో గడిచిన సంవత్సరాలో తలసరి ఆదాయం,సంపద గణనీయంగా పెరిగిపోవడంతో ఆహార నియమాలు, భోజన సమయాలు పాటించకపోవటం వంటి ఎన్నో కారణాలు అధిక బరువుకు కారణంగా ఉన్నాయి. ఆదాయం పెరుగుదలతో సంప్రదాయి భోజనం వదిలేసి మసాలాలు అధికంగా ఉండే మాంసాహారం, కొవ్వు, తీపి పదార్థాలు అధికశాతం ప్రొసెస్ ఫుడ్ వైపునకు మొగ్గుతున్నారనీ, వీరిలో యువజనులే అధికంగా ఉన్నారని తేలింది. గత కాలంలో అంటే 80 ల నుంచి 2008 వరకు వేసిన లెక్కల్లో స్థూల కాయులుగా మారిన యువత ఇప్పుడు వయస్సులో పెద్దవాళ్లయినా స్థూలకాయంతో ఎన్నో అనారోగ్యలతో ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. ఉత్తర అమెరికా, మధ్య ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో 56 శాతంగా స్థూలకాయులు ఉన్నారు. నిరంతరం సోషల్ మీడియాలోనూ, టివిలకు దగ్గరగా ఉన్నా యువజనుల పైన ప్రకటనల ప్రభావం ఎంతో ఉందనీ చేతిలో డబ్బు, ప్రాసెస్డ్ ఫుడ్ అందుబాటులో ఉండడటం వల్ల, జీవన శైలి పూర్తిగా మారిపోవటం వల్ల ఆహారపు అలవాట్లలో వచ్చిన తీవ్రమైన మార్పుల వల్ల ఈ ఈ ఊబకాయం సమస్య ఉత్పన్నం అయింది. కొవ్వు పదార్థాలు, ఉప్పు వినియోగం ఎక్కువకావటంతో కొన్ని రకాల క్యాన్సర్లు, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటీస్ మొదలైనవి పెరిగిపోతున్నాయని రాబోయే కాలంలో ఆహారపు అలవాట్లు మార్చుకోకపోతే యువత దారుణంగా నష్టపోతారని సర్వేలు చెబుతున్నాయి. సంప్రదాయ భోజనంతో ఆహారంతో ఎన్నో రకాల మూలికలు, ఔషధాలు కలగలసి ఉండేవి. తేలికగా జీర్ణం అయ్యే పరిస్థితుల్లో ఆహారాన్ని నెమ్మదిగా ఉడికించేవాళ్లు. జీలకర్ర మొదలైన దినుసులతో ఆహారం ఆరోగ్యవంతంగా తయారయ్యేది. మనుష్యులు ప్రకృతికి దగ్గరగా జీవించేవాళ్లు. ఎన్నో రకాల ఆకుకూరలు పండ్లు భోజనంలో భాగంగా ఉండేవి.రెండు వంతులు ధాన్యాలు మిగతా కూరగాయలు, పెరుగు, పండ్లతో చక్కని భోజనం ఉండేది. ఇప్పుడు కూడా సంప్రదాయ భోజన విధానాల విలువలు యువత అర్థం చేసుకుని ఆ వైపుగా మొగ్గితే క్రమంగా స్థూలకాయం తగ్గించుకోవచ్చు. మితంగా భోజనం చక్కని వ్యాయామం, చక్కని నిద్రవేళలో, మొదలైనవి పాటిస్తే ఆరోగ్యం మన గుప్పిట్లో ఉన్నట్లే. చక్కని ఆరోగ్యం సొంతం కావాలంటే మంచి ఆహారం, నిద్ర ఎంతో అవసరం.