Fashion

తెలుగు రాష్ట్రాల్లో వజ్రాల వాన

తెలుగు రాష్ట్రాల్లో వజ్రాల వాన

**అక్కడ వజ్రాలు దొరుకుతాయట. వజ్రాలంటే ఎవరికి ఇష్టం వుండదు చెప్పండి. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ దాకా వజ్రాలిస్తామంటే లేచి గంతులేస్తారు. అవి ఓ చోట దొరుకుతాయంటే నిద్రాహారాలు మానేసినా సరే వాటిని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. అలాగే వజ్రాలు నిజంగా దొరుకుతాయట. ఎక్కడ అనుకుంటున్నారా?
*ఆగండాగండి ఆ విషయానికే వస్తున్నాను అదేమిటో మీరు చూసి ఎంజాయ్ చేసేయండి.వీలైతే మీరు కూడా అక్కడికి వెళ్లి వజ్రాల వేట కొనసాగించండి. ఒక్క వజ్రం దొరికినా చాలు మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది.వీళ్ళంతా వేయి కళ్ళతో, కోటి ఆశలతో వెదుకుతున్నది వజ్రాల కోసమే. వజ్రాల వేట ఇప్పటిది కాదు. ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైనది అంతకన్నాకాదు. వేల ఏళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా మనిషి వజ్రాల కోసం అన్వేషణ జరుపుతూనే ఉన్నాడు. దొరికినవాడ్ని అదృష్టవంతుడు అంటున్నారు. వజ్రం దొరకనివారు నిరుత్సాహపడకుండా వెతుకులాట కొనసాగిస్తూనే ఉన్నారు.
1. అసలు వజ్రాలు ఎక్కడెక్కడ దొరుకుతాయి?
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వజ్రాలు దొరుకుతున్నాయో చూద్దాం. మన కృష్ణా, గోదావరి, పెన్నా నదుల కిరువైపుల వజ్రాలు పుష్కలంగా లభిస్తున్నాయి. అనంతపూర్‌, కర్నూలు, నల్గొండ, గుంటూరు, కృష్ణా, మహబూబ్‌ నగర్‌, కడప జిల్లాల్లో వజ్రాలు ఎక్కువగా దొరుకుతున్నాయి.
2. వజ్రాలకు ప్రసిద్ధి చెందిన వూరు ?
కృష్ణా నది కుడి గట్టున ఉన్న కోళ్ళూరు ప్రాంతం వజ్రాలకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇండియాలో మొదటి డైమండ్‌ సెంటర్‌ ఇదే. 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు వజ్రాల కోసం ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు.
3. రికార్డులు ఏం చెబుతున్నాయి ?
కోళ్ళూరులోనే కాదు కృష్ణా జిల్లా పరిటాలతోపాటు, గొల్లపల్లి, మల్లపల్లి, రామళ్ళకోట, బనగానపల్లిలో ఆ కాలంలో వజ్రాలకోసం తవ్వకాలు జరిగాయి. ఆడమగ, పిల్ల పెద్ద అనే తేడా లేకుండా దాదాపు 60 వేల మంది ఇక్కడ జరిగిన వజ్రాల తవ్వకాల్లో పాల్గొన్నారని రికార్డులు చెబుతున్నాయి.
4. కోహినూర్‌ వజ్రం మన తెలుగు రాష్ట్రాలలోనే లభించిందా?
ఈ ప్రాంతమంతా అప్పట్లో గోల్కొండ రాజ్యంలో భాగంగా ఉండేది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్‌ వజ్రం కోళ్ళూరు లోనే లభించింది.
5. వజ్రాలను గోల్కొండ వజ్రాలు అని ఎందుకు పిలుస్తారు?
అది కాల క్రమంలో బ్రిటీష్‌ మహారాణి కిరీటాన్ని అలంకరించింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో లభించిన వజ్రాలను గోల్కొండ వజ్రాలుగా ప్రపంచవ్యాప్తంగా పిలుస్తున్నారు.
6. డైమండ్‌ హంటింగ్‌ అంటే ఏమిటి?
ఇప్పటికీ అనేకమంది విదేశీ శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి వజ్రాల అన్వేషణకు దిగుతున్నారు. అలా వచ్చిన వీరు భూమి ఉపరితలం పైనా, నదీ గర్భంలోనూ డైమండ్‌ హంటింగ్‌ చేస్తున్నారు. అయితే వీరు చేసే అన్వేషణకు చాలా డబ్బు ఖర్చవుతుంది.
7. ఎలాంటి ప్రాంతాల్లో వజ్రాలు లభిస్తున్నాయి?
సాధారణ జనం ఇంత డబ్బు ఖర్చు చేసి వజ్రాలను వెదకడం కష్టమే అయినా వారి పరిధిలో వారు అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. అనంతపురం జిల్లా వజ్రకరూర్‌, కర్నూలు జిల్లా పత్తి కొండ, మద్దికెర, తుగ్గలి, నెల్లూరు జిల్లా తిమ్మసముద్రం, నల్లగొండ జిల్లా కృష్ణా నది ఒడ్డున ఉన్న అనేక ప్రాంతాల్లో వజ్రాలు లభిస్తున్నాయి.
8. డైమండ్‌ హంటింగ్‌కు సరైన కాలం ఏంటో మీకు తెలుసా?
సాధారణ జనం వర్షాలు పడగానే ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళి వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. డైమండ్‌ హంటింగ్‌కు సరైన కాలం వర్షాకాలం. వర్షం కురిసి వెలిసిన (ఆగిన) తరువాత వెళితే మంచి ఫలితాలు ఉంటాయి. వర్షం కురిసిన ప్రతిసారి భూమిపై పొర కొట్టుకుపోయి అందులో నిక్షిప్తమైన వజ్రాలు బయటపడుతూ ఉంటాయి. అలాగని కేవలం వర్షాకాలంలో మాత్రమే వజ్రాలు దొరుకుతాయని కాదు.
9. వజ్రాలను ఎలా వెదకాలి?
ఏ కాలంలోనైనా వజ్రాల కోసం ప్రయత్నించవచ్చు. వజ్రాలు దొరుకుతాయన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న మట్టిని, గులకరాళ్ళను వివిధ పరిమాణాల్లో ఉన్న జల్లెళ్ళతో జల్లించాలి. జల్లించగా జల్లెడలో ఉన్న రాళ్ళలో వజ్రాలేమయినా ఉన్నాయేమో వెదకాలి.
10. వజ్రాలను సొంతం చేసుకోవడం సులభమా?
అలాగే నదులు, సెలయేళ్లలో ఉండే మట్టిని బయటికి తీసి జల్లెళ్ళలో వేసి నీళ్ళలో ముంచి శుభ్రం చేస్తే కొన్ని గులకరాళ్ళు జల్లెడలో మిగులుతాయి. వాటిలో వజ్రాలున్నాయేమో పరిశీలించాలి. ఇలా చేస్తే వజ్రాలను సొంతం చేసుకోవడం సులభం అవుతుంది.
11. విదేశీ అన్వేషక బృందం
గుంటూరు జిల్లా కోళ్లూరుకు ఆమధ్య వచ్చిన ఒక విదేశీ అన్వేషక బృందం అక్కడ ఉన్న కృష్ణానదిలోని మట్టిని జల్లెడలో వేసి నీళ్ళలో ముంచి శుభ్రం చేసినప్పుడు ఓ వజ్రం దొరకడంతో అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
12. ఆధునిక టెక్నాలజీ
విదేశాల్లో చాలా మంది సాధారణ జనం ఇప్పుడు మనం చెప్పుకున్న పద్ధతుల్లోనే అనేక వజ్రాలను సొంతం చేసుకుంటూ ఉంటారు. వారు పెద్దగా టెక్నాలజీని ఉపయోగించేది లేదు. అయితే కొంతమంది వజ్రాలను పరీక్షించడానికి ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్న మాటా నిజమే.
13. తెలుగు రాష్ట్రాలు వారు
ఆధునిక పరికరాలు కొనలేనివారు తమ అనుభవంతో కంటి చూపుతోనే వజ్రాన్ని గుర్తించేవారు మన తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది ఉన్నారు. కొన్ని తరాల నుంచి వజ్రాల వేట కొనసాగిస్తున్న కుటుంబాల వారికి ఈ పరిజ్ఞానం తరం👌 నుంచి తరానికి సంక్రమిస్తూ వస్తోంది.
14. విదేశాల్లో ఉన్న సాధారణ వ్యక్తులు
అటువంటివారు ఎందరో వజ్రాలను గుర్తించి సొంతం చేసుకుంటున్నారు. అయితే భూమి లోపలికి తవ్వకుండానే విదేశాల్లో ఉన్న సాధారణ వ్యక్తులు కూడా మట్టిని, గులకరాళ్ళను క్రషర్‌లో వేసి గ్రైండ్‌ చేస్తున్నారు. ఆ క్రషర్‌ ధాటికి గులకరాళ్ళు నుగ్గునుగ్గయిపోయిపోతాయి.
*ఎలా సేకరిస్తారు?
ఆ గులకరాళ్ళలో ఉన్న వజ్రాలు మాత్రం గట్టిగా చెక్కుచెదరకుండా మిగిలిపోతాయి. వీటిని జల్లెడ ద్వారా సేకరించి సొంతం చేసుకుంటారు.
*ఎవరిని సంప్రదించాలి.
రకరకాల పద్ధతుల ద్వారా ఎంతో శ్రమకోర్చి చేజిక్కించుకున్న వజ్రాలనుకుంటున్న రాళ్ళను అసలు వజ్రాలో కాదో తేల్చుకోవడానికి ఎవరిని సంప్రదించాలో తెలియదు. ఒకవేళ వజ్రాలే అయితే వాటి విలువ కట్టేవారెవరు? వాటిని ఎలా అమ్ముకోవాలి, ఎవరికి అమ్ముకోవాలి అనే ప్రశ్నలు తలెత్తుతాయి.
*ప్రభుత్వ సంస్థలు
నిజమైన వజ్రాలు దొరికినా దళారులు, వ్యాపారుల చేతుల్లో మోసపోతున్న వారు చాలా మంది కనిపిస్తారు. నిజానికి వజ్రాలను పరీక్షించి వాటి విలువను కూడా నిర్ధారించి ఒక సర్టిఫికెట్‌ కూడా ప్రభుత్వ సంస్థలే జారీ చేసే సదుపాయం ఉందనే విషయం చాలామందికి తెలియదు.
*ఎక్కడ
నవ్యాంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లా వజ్రకరూర్ ప్రాంతంలో వజ్రాలు లభ్యమౌతున్నాయని వార్తలు రావడం,అక్కడి ప్రజలు తండోపతండాలుగా అక్కడికివెళ్ళి వజ్రాల వేటలో పడటం జరుగుతుంది.
*వజ్రాన్వేషణ
ప్రతియేట జూన్ లో వర్షాలు కురిసిన తరువాత ఇక్కడ వజ్రాలు దొరుకుతాయట. అందుకే ఆ ప్రాంతం వారితో పాటు ఆ పరిసర ప్రాంతాల వారు కూడా అక్కడికి వెళ్లి వజ్రాన్వేషణ గావిస్తారట.
*ప్రతి రాయీ వజ్రమా?
అలాగే చాలామంది అక్కడికివెళ్లి వజ్రాల వేటలో పడ్డారట.ప్రతిరోజూ ఉదయం వెళ్ళడం,సాయంత్రం దాకా అక్కడేవుండి దొరికిన ప్రతి రాయినీ పరీక్షించి వజ్రంలా వుంటే దానిని ఇంటికి తెచ్చుకోవటం చేస్తుంటారు.
*ఇదంతా వింటుంటే మీకు కూడా వెళ్లాలనిపిస్తుందా?
అలా అన్వేషణ చేపట్టిన ఒకరికి లక్ష రూపాయల ఖరీదు చేసే వజ్రం ఒకటి ఇటీవల దొరికిందని అందుకే తాము కూడా వజ్రాలు కోసం వెళుతున్నామని అక్కడివారు చెబుతున్నారు.ఏంటిదంతా వింటుంటే మీక్కూడా వెళ్లాలనిపిస్తుంది కదా.
*వజ్రకరూర్ గ్రామం
అయితే ఎందుకాలస్యం.అనంతపురం జిలా వజ్రకరూర్ గ్రామానికి వెళ్ళండి. వజ్రాలు ఏరుకుని తెచ్చుకోండి.ఏమో ప్రయత్నం చేస్తే వజ్రం దొరకొచ్చేమో?ఒక్క వజ్రం కానీ దొరికిందా?మీ పంట పండినట్లే.