Movies

ఎందుకు దాచుకోవడం?

ఎందుకు దాచుకోవడం?

కథానాయికలు నిత్యం అందంగా కనబడటానికే ఇష్టపడుతుంటారు. సాధారణంగా తమ వయసు చెప్పడానికి ఇష్టపడరు. అది తనకు అస్సలు నచ్చదు అంటోంది పరిణీతి చోప్రా. ఈ మధ్యే తన 31వ పుట్టిన రోజు జరుపుకుంది పరిణీతి. నాయికలు తమ వయసుని దాచుకోవడంపై మీరేమంటారు అంటే.. ‘‘అంత దాచుకోవాల్సిన విషయం అందులో ఏముంది? వయసు అనేది ఓ అంకె మాత్రమే. ఈ భూమ్మీద మనం ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నామో సూచిస్తుందంతే. వయసు చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది. నేనయితే ఇలాంటి సిల్లీ విషయాలకు చాలా దూరంగా ఉంటాను’’అని చెప్పింది.నేను ఎవర్ని: ఈసారి పుట్టినరోజు తన ఆలోచనలో మార్పు తెచ్చింది అంటోంది పరిణీతి. ‘‘ప్రతి ఏడాది పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా ఎలా గడపాలా అని ఆలోచించేదాన్ని. కానీ ఈసారి నా ఆలోచన తీరు మార్చుకున్నాను. ‘‘నేను ఎవర్ని? ఈ భూమ్మీదకు ఎందుకు వచ్చాను. ఇప్పటి వరకూ నేను ఏం సాధించాను? భవిష్యత్తులో ఇంకా చేయాలి? ఇలాంటి విషయాలు గురించి మాత్రమే ఆలోచించాను. వరుసగా షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని సైనా నెహ్వాల్‌ బయోపిక్‌కు సిద్ధమవుతాను’’అని చెప్పింది పరిణీతి.