NRI-NRT

బ్రిటన్‌లో బాపు బర్తడే

బ్రిటన్‌లో బాపు బర్తడే

భారత జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని బ్రిటన్‌లోని వేల్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఇక్కడి కార్డిఫ్‌ పట్టణంలో ఉన్న ఇండియా సెంటర్‌కు చెందిన హిందూ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇంగ్లండులోనే ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ‘సెయింట్‌ ఫాగన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్ హిస్టరీ’ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో.. రెండువేలకు పైగా భారతీయులు, ఆంగ్లేయులు కూడా పాల్గొని బాపూజీకి నివాళులర్పించారు.