Sports

సంజూ కోసం…

Smriti Manthana Watching IPL For Sanju Samson

మహిళా క్రికెట్‌ జట్టు ఓపెనర్‌, స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన సంజూ శాంసన్‌ బ్యాటింగ్‌ స్టైల్‌కు తాను ఫిదా అయ్యాయని చెప్పింది. ఈ మేరకు ఓ జాతీయ మీడియాతో ముచ్చటించిన మంధాన.. శాంసన్‌ కొట్టే బౌండరీలు తననెంతో కట్టిపడేశాయని పేర్కొంది. అతనికి ఫ్యాన్‌గా మారిపోయానని, శాంసన్‌​ కోసమే రాజస్తాన్‌ జట్టుకు సపోర్టు చేస్తున్నానని అభిప్రాయపడింది. తన ఆటతీరుతో ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడని, శాంసన్‌ బ్యాటింగ్‌ కోసమే రాజస్తాన్‌ మ్యాచ్‌ చూస్తున్నట్లు తెలిపింది. కాగా నేటి మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడనుంది.