DailyDose

రేపు ప్రధానితో జగన్ భేటీ-తాజావార్తలు

YS Jagan To Meet With PM Modi-Telugu Breaking News

* రేపు ఉదయం 10.40 గంటలకు ప్రధాని తో ఏపి సిఎమ్ భేటీ..రేపు మధ్యాహ్నం 12 గంటలకు “అపెక్స్ కౌన్సిల్” వీడియో సమావేశం..పాల్గొననున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. 10 మంది బృందంతో ఢిల్లీకి బయల్దేరిన జగన్విజయవాడ నుంచి ఢిల్లీకి బయల్దేరిన జగన్ఇప్పటికే ఖరారైన మోదీ అపాయింట్ మెంట్ఏపీ ముఖ్యమంత్రి జగన్ విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ ఉదయం పులివెందులలో తన మామ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో జగన్ పాల్గొన్నారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం నేరుగా ఢిల్లీకి బయల్దేరారు. జగన్ తో పాటు 10 మంది బృందం ఢిల్లీకి పయనమైంది. రేపు నదీ జలాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి సంబంధిత అధికారులకు జగన్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.మరోవైపు ప్రధాని మోదీని కలిసేందుకు జగన్ కు అపాయింట్ మెంట్ ఖరారైంది. మోదీతో సమావేశం సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై జగన్ చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో జగన్ భేటీ కానున్నారు. మరోవైపు కేంద్ర కేబినెట్ లోకి వైసీపీ చేరబోతోందనే వార్తలతో జగన్ పర్యటన మరింత ఆసక్తికరంగా మారింది.

* కరోనా వైరస్​ కారణంగా నొప్పి నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.అమెరికాలోని ఆరిజోనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.కరోనా వ్యాప్తిలో సగం మేర వ్యాధి లక్షణాలు ప్రారంభం కావడానికి ముందే జరిగిపోతాయి.కొవిడ్​-19 ఇన్​ఫెక్షన్లలో 40శాతం కేసుల్లో వ్యాధి లక్షణాలు కనిపించటంలేదు.

* ఏపీలో మరో శిరోముండనం ఘటనఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో జరిగిన శిరోముండనం ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది.పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తీసుకున్న అప్పు తీర్చలేదంటూ ఓ యువకుడిని కారులో బలవంతగా తీసుకెళ్లి శిరోముండనం చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.జంగారెడ్డిగూడెం ఎస్సై కుటుంబరావు తెలిపిన వివరాల ప్రకారం….జిల్లాలోని తాడేపల్లిగూడేనికి చెందిన అలక అభిలాష్‌(23) జంగారెడ్డిగూడేనికి చెందిన యర్రసాని విజయ్‌బాబు వద్ద మూడు నెలల క్రితం రూ.30 వేలు అప్పుగా తీసుకున్నాడు.ఈ బాకీని తీర్చాలంటూ విజయ్‌బాబు గత మూడు రోజులుగా అభిలాష్‌ని అడుగుతున్నాడు.ఇదే విషయమై అక్టోబర్‌ 3వ తేదీన రాత్రి విజయ్‌బాబు, తన మిత్రులు షేక్‌ నాగూల్‌ మీరావళి, కంకిరెడ్డి మార్కేండేయులతో కలిసి తాడేపల్లిగూడెంలోని అభిలాష్‌ ఇంటికి వెళ్లారు.అక్కడ నుంచి అభిలాష్‌ను కారులో ఎక్కించుకుని నేరగా జంగారెడ్డిగూడెం బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీకి తీసుకువచ్చి ఓ ఇంట్లో ఉంచారు.

* గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్నికల నిర్వహణ విషయమై ఇప్పటికే ఎన్నికల సంఘం అఖిలపక్ష సమావేశం నిర్వహించి పార్టీల నుంచి అభిప్రాయాలు కోరింది. ఈ అంశంపై ఇటీవల రాష్ట్రంలో గుర్తింపు పొందిన 50 రాజకీయ పార్టీలకు లేఖ రాసింది.

* ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారాల ప్రకటన ప్రారంభమైంది. ఈ ఏడాది వైద్య రంగంలో ముగ్గురిని నోబెల్‌ వరించింది. ‘హెపటైటిస్‌ సీ’ వైరస్‌ గుర్తింపులో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తలు హార్వే జే. ఆల్టర్‌, మైఖెల్‌ హాటన్‌, ఛార్లెస్‌ ఎం. రైస్‌లకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. హెపటైటిస్‌ లేదా కాలేయంలో మంట.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఒకటి. దీని వల్ల ఎంతో మంది కాలేయ క్యాన్సర్‌ బారిన పడుతున్నారు.

* గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్నికల నిర్వహణ విషయమై ఇప్పటికే ఎన్నికల సంఘం అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు కోరింది. ఈ అంశంపై ఇటీవల రాష్ట్రంలో గుర్తింపు పొందిన 50 రాజకీయ పార్టీలకు లేఖ రాసింది.

* ప్రజాప్రతినిధులపై కేసుల సత్వర విచారణకు కార్యాచరణ రూపొందించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వివిధ హైకోర్టులు అందుకు రంగం సిద్ధం చేశాయి. దీనిని అమికస్‌ క్యూరీ విజయ్‌ హన్సారియా సుప్రీం కోర్టుకు సమర్పించారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై 4859 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌ కేసుల్లో యూపీ అగ్రభాగాన నిలవగా రెండో స్థానంలో బిహార్‌ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 132, తెలంగాణలో 143 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

* కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రానున్న బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలు ఇంటివద్దే నిర్వహించుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. పండుగల పేరుతో ఎక్కువ మంది కలిస్తే కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని హెచ్చరించారు. గాంధీ మినహా అన్ని ఆస్పత్రుల్లో ఇతర సాధారణ వైద్య సేవలు మొదలయ్యాయని.. గాంధీలో కూడా త్వరలో ఇతర వైద్య సేవలు ప్రారంభిస్తామని ఈటల రాజేందర్‌ తెలిపారు.

* హిందూ మహా సముద్రంలో పాగా వేసి భారత్‌ను ముప్పేట బంధించాలనే చైనా ఆశాలకు డీఆర్‌డీవో గండికొడుతోంది. సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌లో ఆధిపత్యం లభించేలా ఓ కీలక టార్పిడోను శరవేగంగా అభివృద్ధి చేస్తోంది. దీనికి సంబంధించి సోమవారం ఉదయం నిర్వహించిన కీలక పరీక్షలో విజయం సాధించింది. సూపర్‌ సానిక్‌ మిసైల్‌ అసిస్టెడ్‌ రిలీజ్‌ ఆఫ్‌ టార్పిడో (స్మార్ట్‌) ఆయుధ వ్యవస్థను నేడు పరీక్షించింది. ఈ విషయాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.

* జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి ఒడిగట్టారు. శ్రీనగర్‌ సరిహద్దు ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై దాడికి తెగబడ్డారు. కాగా ఈ దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులు కాగా.. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్‌ సరిహద్దులో సీఆర్పీఎఫ్‌కు చెందిన భద్రతా దళాలు జాతీయ రహదారిపై పహారా కాస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు ఉగ్రవాదులు భద్రత సిబ్బందిపై బహిరంగ కాల్పులకు తెగబడ్డారు.

* ప్రాణాంతక కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్‌‌ వ్యాక్సిన్‌లో అల్‌హైడ్రాక్సిక్విమ్‌-2 అనే అనుంబంధ ఔషధాన్నీ వినియోగించనున్నట్లు ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. దీని వల్ల మెరుగైన వ్యాధినిరోధకశక్తితో పాటు ఎక్కువ కాలం వైరస్ నుంచి రక్షణ లభిస్తుందని వివరించింది. ఈ ప్రత్యేక కారకాన్ని వైరోవ్యాక్స్‌‌ అనే సంస్థ అందించనున్నట్లు వెల్లడించింది.

* కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనం కల్పిస్తాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో మార్కెట్‌ వ్యవస్థ, కనీస మద్దతు ధర కొనసాగుతుందని వెల్లడించారు. ప్రస్తుతం రైతులు వారి బిడ్డలను వ్యవసాయం చేయమని చెప్పే పరిస్థితి లేదని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేందుకు మోదీ సర్కార్‌ నూతన చట్టాలను చేసిందన్నారు.

* మారటోరియం కేసులో విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్‌ 13వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి, ఆర్‌బీఐకు వడ్డీలు మళ్లీ లెక్కగట్టేందుకు మార్గదర్శకాల జారీ, నోటిఫికేషన్స్‌, సర్య్కూలర్ల జారీ వంటి అంశాలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని పేర్కొంది. విచారణ సందర్భంగా కేంద్రం కేబినెట్‌ నోట్‌ను అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించి ఆమోదం తీసుకొంది. ప్రభుత్వ అఫిడవిట్‌లో సమగ్ర సమాచారం లేదని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.

* రాజకీయ ప్రయోజనాల కోసం కులం, మతం పేరుతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నాయని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆరోపించారు. 7 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 3న ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అంరోహా జిల్లాలోని నవ్‌గవాన్‌ సదత్‌లో ఆదిత్యనాథ్‌ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.