DailyDose

కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్య-నేరవార్తలు

Crime News - Guy Kills Himself In Front Of Ananthapur Collectorate

* అనంతపురంలోని కలెక్టరేట్ ఎదుట గూగూడు గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.తన తల్లి అయిన రామలక్ష్మి డ్వాక్రా గ్రూప్ లో ఉంది.ఆ గ్రూప్ కు 40000 రాగా ఆ డబ్బుల్లో రాములక్షమి కి రూ.4000 రావాలి. ఆ నగదును డ్వాక్రా సభ్యులు రాములక్ష్మికి ఇవ్వలేదు.మాకు రాలసిన డబ్బులు ఎందుకు ఇవ్వలేదని డ్వాక్రా సభ్యులను అడగ్గా సరైన సమాధానం వారు ఇవ్వలేదు.దీంతో సోమవారం స్పందన కార్యక్రమం లో అర్జీ ఇవ్వడానికి వచ్చాడు.అధికారితో మాట్లాడిన అనంతరం రాజశేఖర్ రెడ్డి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.రాజశేఖర్ రెడ్డి కలెక్టరేట్ ఎదుటే మరణించాడు

* నగర శివార్లలో జరిగిన కాల్పుల ఘటనలో నిందితుల ఫొటోలను పోలీసులు సేకరించారు.సంఘటనా స్థలం నుంచి కారును ముస్తాబాద్‌ వైపు తీసుకువెళ్లి టింబర్‌ డిపో ముందు వదిలేశారు.కారు వదిలేసి పారిపోతున్న సమయంలో అక్కడ సీసీ కెమెరాలో నిందితుల దృశ్యాలు రికార్డ్‌ అయ్యాయి.దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.సంఘటనా స్థలంలో దొరికిన బులెట్ల ఆధారంగా నిందితులు 7.65ఎమ్ఎమ్ పిస్టల్​ను వాడినట్లు పోలీసులు గుర్తించారు.పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.

* జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ రేపటికి వాయిదాహైదరాబాద్ లోని సీబీఐ, ఈడీ కోర్టుల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది.కాగా, గత శుక్రవారం ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం నేటికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోర్టులో విచారణ జరిగింది.అలాగే, హైకోర్టులో స్టే ఉన్న మరికొన్ని కేసుల్లో విచారణను వచ్చేనెల 9న కోర్టు విచారించనుంది.ఈ కేసుల్లో విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరపాలని ఏపీ సీఎం జగన్ తరఫు న్యాయవాదులు ఇప్పటికే కోర్టును కోరారు.అయితే, దీనిపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

* న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసు సీబీఐకి అప్పగింతఇవాళ విచారణ తర్వాత సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం.రెండు నెలల్లో రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు.న్యాయవ్యవస్థపైన, జడ్జిలపైన సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన వారిపై ఇప్పటికే సీఐడీ కేసు.సీబీఐ విచారణకు సహకరించాలంటూ ప్రభుత్వానికి సూచన.హైకోర్టుపై అనుచిత పోస్టులు, వ్యాఖ్యలు చేసిన వారిలో ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టకపోవడాన్ని గతంలోనే తప్పుపట్టిన హైకోర్టు.హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ 19 మందిపై ఫిర్యాదు చేస్తే కేవలం తొమ్మిది మందిపైనే కేసులు నమోదు చేయడంపై నిలదీసిన కోర్టు.స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీలు విజయ సాయి రెడ్డి, నందిగం సురేష్ మరికొందరు ప్రజాప్రతినిధుల వ్యాఖ్యల్ని ఇప్పటికే తప్పుపట్టిన హైకోర్టు.

* నగరంలోని రాయదుర్గం కాంట్రాక్టర్‌ మధుసూదన్‌ రెడ్డి ఇంట్లో జరిగిన దోపిడీ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పనిమనుషులుగా చేరి.. భారీగా నగదు, బంగారం దోచుకెళ్లిన నేపాల్‌ గ్యాంగ్‌ని రాష్ట్ర పోలీసులు యూపీ సరిహద్దులో అరెస్ట్‌ చేశారు. వీరు రాయదుర్గంలో ఈనెల 6న మధునూదన్‌రెడ్డి భార్యకి మత్తు మందు ఇచ్చి.. 15 లక్షల రూపాయల నగదు, బంగారం చోరీ చేశారు. వీరు వాచ్‌మెన్‌, పనిమనుషులుగా ఇళ్లలోకి చేరి చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు వీరి వద్ద నుంచి 5 లక్షల రూపాయల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్‌ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ ‘రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగిన చోరికి సంబంధించి నేపాల్ గ్యాంగ్‌కి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశాం.