Business

SBIలో 2వేల ఉద్యోగాలు

SBIలో 2వేల ఉద్యోగాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2 వేల ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ఎస్బిఐ నోటిఫికేషన్ లో తెలిపింది. ఇందులో జనరల్ కేటగిరీలో 810, OBC లకు 540, SC లకు 300, ST లకు 150, EWS కేటగిరీలో 200 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. 21 నుంచి 30 ఏళ్ల లోపు వారై ఉండాలి. ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ డిసెంబరు 4. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.