Fashion

ముత్యం గూర్చిన సత్యం

The facts about pearl - Telugu fashion news

ముత్యాల గురించిన ముచ్చట ఇప్పటిది కాదనడానికి ఎన్నో ఉదాహరణలు. రామాయణంలో ఇరవై ఏడు రకాల ముత్యాలతో చేసిన హారం గురించిన వర్ణన ఉంది. కృష్ణుడు ముత్యాల హారాలు వేసుకున్నాడని కథలున్నాయి. క్లియోపాత్రా ఒక పెద్ద ముత్యాన్ని వెనిగర్లో కరిగించి తాగి తానెంత ధనవంతురాలో లోకానికి చెప్పిందట. అంటే అప్పట్లో ముత్యం విలువ ఎంత ఉందో అర్థమవుతుంది. రోమన్ల కాలంలో మహిళల సమాధుల్లో ముత్యాలుండేవి. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ముత్యం కోడిగుడ్డంత ఉంటుంది. దాని బరువు 454 క్యారట్లు. మన దేశంలో అతి పెద్ద ముత్యం పేరు లా పెరెజిమా. దీని బరువు 28 క్యారట్లు. హైదరాబాద్ సిటీలో ఏడాదికి 500 కోట్ల రూపాయల ముత్యాల వ్యాపారం జరుగుతుంది. అందులో దాదాపు 40 శాతం వ్యాపారం టూరిస్ట్ల మీదే జరుగుతుంది. ముత్యాలు ఎక్కడనుంచి వచ్చాయి అన్నది ముఖ్యం కాదు, ముత్యాలు నాణ్యమైనవా కాదా, వాటి ఆకారం,రంగు ఎలా ఉన్నాయని మా త్రమే వినియోగదారులు చూస్తారు అని హైదరాబాద్ దుకాణదారులు అంటారు. స్వాతం త్య్రం వచ్చే సమయానికి హైదరాబాద్లో కేవలం రెండు ముత్యాల దుకాణాలు ఉండేవి. ఏళ్లు గడిచే కొద్దీ 300 పైగా దుకాణాలు ఏర్పడ్డాయి. చార్మినార్ దగ్గర పత్తర్ గాటి,లాడ్బజార్,అబిడ్స్,బషీర్బాగ్లలో చాలా ముత్యాల దుకాణాలున్నాయి. సూరజ్ భాన్ జ్యూయలర్స్, బషీర్ బాగ్, జగదాంబ సెంటరు,
పెరల్స్ మొదలైన చాలా దుకాణాలు ముత్యాల నగలు విక్రయిస్తారు. ముత్యాల నగలు ఇష్టపడని మహిళలుంటారా! ఠీవిగా రాజసం ఉట్టిపడే ముత్యాలు ధరిస్తే వేసుకున్నవారికి ఆనందం, చూసే కళ్లకు ఆహ్లాదం. అంతేకాదు, ముత్యాలు పేదలకు,ధనికులకు వర్గ బేధం లేకుండా అందుబాటులో ఉంటాయి. మన హైదరాబాద్ ముత్యాల నగరం. మరి మన ముత్యాల గురించి మనం మరిన్ని విశేషాలు తెలుసుకోవాలి కదా.
****ముత్యాలకు మెరుగులు ఎలా దిద్దుతారు..
ఒకసారి ముత్యాలకు రం ధ్రాలు చేసిన తర్వాత వాటిని నాలుగు రోజుల వరకు ఉడక పెట్టి వాటి రంగు మెరుగుపడేలా బ్లీచ్ చేస్తారు. హై డ్రోజన్ పెరాక్సైడ్, నీరు ఉన్న గాజు సీసాల్లో వాటిని ఉంచుతారు.అడుగున గాజు ఉన్న సన్ బాక్స్లలో ఉంచి ఎండ తగిలేలా ఉంచుతారు. చివరగా వాటిని కడిగి వాటి ఆకారాలు, పరిమాణాల ఆధారంగా వేటికవి ఏరుతారు. రంగు ఆధారంగా కూడా వాటిని గ్రేడ్ చేస్తారు. గులాబీ రంగు, నలుపు రంగులో ఉన్న ముత్యాలు మంచి నాణ్యత గలవిగా, తెల్ల ముత్యాలు ప్రధానంగా సం ప్రదాయకమైనవిగా గుర్తిస్తారు. మంచి నాణ్యత ఉన్న తెల్ల ముత్యాలు నీలిరంగు మెరుపును కలిగి ఉంటాయి. అదే నాణ్యత తక్కువ తెల్ల ముత్యాలు ఆకుపచ్చ లేదా పసుపు రంగు పూతతో ఉంటాయి. నల్ల ముత్యాలు ఆకుపచ్చ పూతతో వంకర టింకరగా ఉంటాయి ఇం ద్రధనుస్సు రంగులు ప్రతిఫలించే నల్ల ముత్యాలు కూడా విలువైన వెరైటీలు. నలుపు, గులాబీ ముత్యాలు అరుదుగా దొరుకుతాయి. అయినా చాలావరకు హైదరాబాదీ ముత్యాల నగలు వీటితో తయారవుతాయి.ఇప్పుడు యూరోప్, అమెరికా లకు కూడా ముత్యాలు ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నారు.
****ముత్యాల కథ
ముత్యాలు ప్రకృతిలో లభించే నవరత్నాలలో ఒకటి. ఇవి మొలాస్కా జాతికి చెందిన ముత్యపు చిప్పలో తయారవుతాయి. మొదటగా కొన్ని ఇసుక రేణువులు ముత్యపుచిప్పలోకి ప్రవేశిస్తాయి. అవి కలిగించే చలనం వలన ముత్యపు చిప్ప వాటిపైకి ఒక ప్రత్యేకమైన ద్రవపదార్థాన్ని విడుదలు చేస్తుంది. అది గట్టిపడి ముత్యంగా రూపాంతరం చెందుతుంది. ముత్యాలలో మంచి నీళ్లలో ఏర్పడ్డవి, ఉప్పునీటిలో ఏర్పడ్డవి రెండు రకాలు ఉంటాయి. చూడ్డానికి ఒకే రకంగా అనిపించినా వేర్వేరు స్థానాల నుంచి తయారవుతాయి. ముత్యాలకు 5500 ఏళ్ల చరి త్ర ఉంది. చైనాలో కూడా 4000 ఏళ్ల క్రితం కూడా ముత్యాలు వాడినట్టు చరి త్ర చెబుతోంది. కాని ముత్యాలను కనుగొనాలంటే సము ద్రపు ఆడుగున వెతకాల్సిందే. అప్పట్లో ఒక ముత్యాల హారం తయారు చేయాలంటే చాలా కష్టమైన పని. కాబట్టి ధనికులు, ఉన్నత వర్గాల వారు మా త్రమే వాడేవారు. ఎక్కడి నుంచి వచ్చినా ఎలా ఏర్పడినా ఇవి తయారయ్యేది మా త్రం కాల్షియం కార్బొనేట్ అనే పదార్థం తోనే. కొన్ని నీటి బిందువు ఆకారంలో, కొన్ని అండాకారంలో, కొన్ని అర్థ వృత్తాకారంలో ఉంటాయి. వీటిలో గుం డ్రంగా, ఇంకా బిందువు ఆకారంలో ఉన్నవి ఎక్కువ ధర పలుకుతాయి. ముత్యాల నిర్మాణం పొరలు,పొరలుగా ఉండటం చేత నలిపివేయడం లేదా పగలకొట్టడం కష్టం.
***ముత్యాలు సాగు చేయడం ఏంటి…
1900 దశాబ్దంలో కృ త్రిమ ముత్యాలు తయారు చేయడం కనిపెట్టే దాకా సహజ ముత్యాలు చాలా అరుదుగా దొరికేవి. కృ త్రిమ ముత్యాలను ప్రపంచమంతా వెదజల్లినవాడు మికీమోటో అనే జపాన్ దేశస్థుడు. ముత్యం తయారయ్యే సృష్టి విచి త్రాన్ని కనుక్కున్నాడు. ముత్యపు పురుగు దేహం(ఓయెస్టర్)లోకి ఒక ఇసుక కణం ప్రమాదవశాత్తూ లోనికి ప్రవేశించి దానికి చాలా బాధ కలిగించడం, ఆబాధానివారణ కోసం ముత్యపు పురుగు కాల్షియం కార్బొనేట్ అనేక వేల పల్చని పొరలుగా ఈ సూక్ష్మకణం చుట్టూ స్రవింపచేయడం, ఈ పొరలు ఘనీభవించి ముత్యంగా రూపొందే సృష్టి విచి త్రాన్ని పరిశోధనలు చేసి కనుక్కున్నాడు. ఒక చిన్న ముత్యపు పురుగు తన ఆవేదనను అత్యంత లావణ్యమైన ఒక ముత్యంగా మార్చడం అతనికి ఎంతో అబ్బురంగా అనిపించింది. మికీమోటోకు ముత్యాల రహస్యం తెలిసిపోయింది. ముత్యపు పురుగులతో కృ త్రిమంగా ముత్యాల సాగు మొదలు పెట్టాడు. సహజంగా తయారయ్యే ముత్యానికి, సాగు ముత్యాలకు ఒకటే తేడా. అసలు ముత్యంలో కేం ద్రకణం స్వాభావికంగా ముత్యపు పురుగు దేహంలో ప్రవేశిస్తుంది. కృ త్రిమ ముత్యంలో కేం ద్రకణం కృ త్రిమంగా ఉంచబడుతుంది. అంతే.ముత్యాల సాగు చైనా,జపాన్,మయన్మార్,భారతదేశాలలో పెద్ద వ్యాపారం.
****ముత్యాలు ఎలా కొనాలి
ముత్యాలు మంచివా కాదా. ఏ షేప్లో ఉన్నవి మంచివి. ఏవి మంచివి కావు? తీరా కొన్న తర్వాత అసలు ఇవి ముత్యాలే కావు. నువ్వు మోసపోయావని అనేవాళ్లూ ఉంటారు. కాదు. నేను కొనే ముత్యాలు మంచివే అని మీకే తెలియాలి. అలా తెలియాలంటే ముత్యాల ఎంపిక ఎలా ఉండాలో తెలుసుకోవాలి.
***హజమైనవా,కృత్రిమ ముత్యాలా
రిటైల్ మార్కెట్లో దొరికేవన్నీ సాగు చేసిన ముత్యాలే. అందులో సందేహం ఏమీ లేదు. అయితే వాటి మీద సహజ ముత్యాలనే ఉంటుంది. చాలామంది నగల వ్యాపారులకు తమ దుకాణంలో అమ్మే ముత్యాలకు సంబంధించిన సమాచారం తెలీదు. ఎప్పటి నుంచో ఉన్న పాత దుకాణాలకు వెళ్లి కొనుక్కోవడం శ్రేయస్కరం.
****ఎటువంటి ముత్యాలను కొనాలి?
మీ స్టైల్కి, మీ బడ్జెట్కి ఎటువంటి ముత్యాలు సరిపోతాయో నిర్ణయించుకోవచ్చు.
***అకోయా ముత్యాలు
తెల్లటి క్లాసిక్ ముత్యాలు ఇవి. ఇవి ఎక్కువగా మెరుపు, చాలా ఎక్కువ నునుపుని కలిగి ఉంటాయి. అకోయా ముత్యాలు 10,11 మిల్లీమీటర్ల పరిమాణంతో ఉంటాయి. 7,7.5 మిల్లీమీటర్లు అంతకన్నా కొంచెం ఎక్కువ ఉన్నవి ఎక్కువ రేటు ఉంటాయి. అకోయా ముత్యం సాధారణంగా తెలుపు లేదా క్రీమ్ కలర్లో ఉంటుంది. ఇంకా, గులబీ లేదా దంతపు పూతతో ఉంటుంది.
****మంచి నీటి ముత్యాలు
మంచి నీటి ముత్యాలు చైనాలో ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. మంచినీటి ముత్యం పరిమాణం సాధారణంగా 2 మిల్లీ మీటర్ల నుంచి 16 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది.
****తాహితియాన్ ముత్యాలు
ఈ ముత్యాలు దక్షిణాది సము ద్రాల నుంచి తయారైనవి. నల్లటి ఆల్చిప్ప నుంచి తయారవుతాయి. సహజంగా నల్ల రంగులో ఉండేవి తాహితియాన్ ముత్యాలు మా త్రమే. ఇవి సాధారణంగా చాలా పెద్ద ముత్యాలు 9 మిల్లీమీటర్ల నుంచి 16 మిల్లీ మీటర్ల పరిమాణంలో ఉంటాయి. తాహితియాన్ ముత్యాలు ఎక్కువగా నల్లగా ఉన్నప్పటికీ బూడిద రంగు, వెండి రంగు,ఆకుపచ్చ,నీలం,వంగరంగుల్లో కూడా దొరుకుతాయి.
***దక్షిణ సము ద్రపు ముత్యాలు
ఇవి ఉప్పునీటి ముత్యాలు.ఉత్తర ఆ స్ట్రేలియా,దక్షిణ తూర్పు ఆసియా,మయన్మార్,ఇండోనేషియా సము ద్రపు ముత్యాలు ఇవి. 10 నుంచి 20 మిల్లీమీటర్ల వ్యాసంలో వెండి,బంగారు రంగుల్లో ఉండే అతి పెద్ద ముత్యాలు ఇవి.మార్కెట్లో చాలా ఎక్కువ ధర పలుకుతాయి.
****ఏ రంగు ముత్యం కొనుక్కోను?
చాలా రంగుల్లో ముత్యాలు దొరుకుతాయి. తెలుపు, లేత వంగపువ్వు రంగు,బంగారు రంగు,గులాబీ, ఆకుపచ్చ, ముదురు వంగపువ్వు రంగుల్లో ఉండే ముత్యాల్లో ఏది కావాలో ఎంచుకోవడమే తరువాయి. తెలుపు ముత్యాలు హుందాగా ఉంటాయి. ముందుగా తెల్లటి ముత్యాల హారం ఉంటే తర్వాత మిగిలిన రంగులు కొనుక్కోవచ్చు అనేది చాలా మంది మహిళల అభి ప్రాయం ఉంటుంది. నలుపు, బూడిద రంగు,ఆకుపచ్చ, నీలం రంగుల ముత్యాలు చూడటానికి కొట్టొచ్చినట్టుగా బాగా కనిపిస్తాయి. చర్మం రంగు తక్కువగా ఉన్నవారికి ఇవి బాగా నప్పుతాయి. గులాబీ,పీచురంగు,లేత వంగరంగులు వేసుకున్న డ్రస్కి మ్యాచ్ చేసుకుని వేసుకుంటే చాలా బావుంటాయి. ఏది ఏమైనా రంగు ఎంపిక అనేది వ్యక్తిగత ఇష్టం.
****ఏం చూసి ముత్యాలకు విలువ కట్టాలి
*ముత్యం ఆకారం
సాగు ముత్యాలు కొనేటప్పుడు ముత్యం విలువ కట్టడానికి చాలా విషయాలు లెక్కలోకి తీసుకోవాలి. ముఖ్యంగా దాని ఆకారం ఏంటో చూడాలి. గుం డ్రంగా ఉండే ముత్యాలు ఏం సందేహం లేకుండా ఎక్కువ ధర పలుకుతాయి. కాని కొంత మంది వంకరటింకరగా ఉండే ముత్యాలు ఇష్టపడుతుంటారు. అలా కాకుండా తీరైన ఆకారంలో ఉన్న ముత్యాలు కొనుక్కోవడం మంచిది.
*ముత్యం ఉపరితలం
ముత్యం ఉపరితలం ముత్యం నాణ్యతను చెప్పే ఇంకో ముఖ్యమైన భాగం. గీతలు, గ్యాప్లు ఉన్నట్టైతే దాని విలువ తగ్గుతుంది. ఇటువంటి ముత్యాలు త్వరగా విరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. మచ్చలు, చిన్న చిన్న బొబ్బలుగా, ముడతలుగా ఉన్నవి మంచి నాణ్యమైనవి కావు.
*ముత్యపు మెరుపు
ఉపరితలం నునుపు లేకపోతే రంగులో మెరుపు కూడా ఉండదు. వినియోగదారులు సాధారణంగా ఎక్కువ మెరుపున్న ముత్యాల కోసమే చూస్తారు. ఎక్కువ నాణ్యత కలిగిన ముత్యం అద్దం లాగా మెరుస్తుంటుంది.
*ముత్యం పరిమాణం
ముత్యం ఎంత సైజులో ఉందో చూడటం కూడా అంతే ముఖ్యం. పెద్దవారు7 మిల్లీమీటర్లు అంతకన్నా పెద్ద సైజులో ముత్యాలు, చిన్నపిల్లలు, టీనేజర్లు చిన్న సైజు ముత్యాలు ఎంచుకుంటే బావుంటుంది.
*కొనేటప్పుడు కొన్ని జా గ్రత్తలు
ముత్యాలు ఫొటోల్లో చూడటానికి చాలా బావుంటాయి కాని విడిగా చూస్తే తేడా ఉండచ్చు. ఆన్లైన్ కొనడం కంటే విడిగా దుకాణానికి వెళ్లి కొనుక్కోవడం మంచిది.
చాలామందికి వారు అమ్ముతున్న ముత్యం ఏంటో తెలీదు. సరైన సమాచారం ఇవ్వలేకపోతే కొనద్దు.బ్రాండ్ పేరు చూసి మోసపోవద్దు. టిఫనీ, ఇంకా మికిమోటో బ్రాండ్ ఉన్నవి మంచి నాణ్యత కలిగిన ముత్యాలు. ముత్యం మంచిదో కాదో కనుక్కోవడానికి పంటి పరీక్ష చేయచ్చు. ముందు పళ్ల మధ్యన పట్టి ముత్యం కొరికి చూస్తే మెత్తగా తగిలితే నకిలీ. గట్టిగా ఉంటే మంచివి అని అర్థం. హైదరాబాద్లో 1906 లో మొదటి ముత్యాల దుకాణం వెలిసింది. నిజాములు,కుతుబ్షాహీలు ముత్యాల వ్యాపారాన్ని ప్రోత్సహించారు. కళలు, చ్రితలేఖనంతోపాటు ముత్యాలను కూడా ప్రోత్సహించారు. హైదరాబాద్ మార్కెట్లో ఎంతో నైపుణ్యం ఉన్న ముత్యాల కళాకారులున్నారు. హాంగ్కాంగ్,పాన్,చైనా నుంచి ముత్యాలు దిగుమతి చేసుకుంటారు. ఒక గ్రాము ముత్యాలు దాదాపుగా 1000 రూపాయలు ఉంటాయి.
ముత్యాలు వైద్యపరంగా కూడా పనికొస్తాయి. ముత్యాల నుంచి వచ్చే కాల్షియం వలన మోతి పిష్టి తేనెతో పాటు తీసుకుంటే గుండె నాళాలు గట్టిపడకుండా కాపాడుతుంది, అత్యధిక రక్తపోటు,ఒత్తిడి తగ్గుతాయి.