DailyDose

విజయవాడ ఆటోడ్రైవర్ నిర్లక్ష్యం-నేరవార్తలు

విజయవాడ ఆటోడ్రైవర్ నిర్లక్ష్యం-నేరవార్తలు

* కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధార్వాడ్ జిల్లాలోని ఇట్టిగట్టి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి,ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

* విశాఖజిల్లా కశింకోట మండలంలోని శుక్లవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై పెను ప్రమాదం సంభవించింది. ఏలూరు నుంచి గాజువాక వైపు వస్తున్న వస్తున్న కారు నూతన గుంటపాలెం వద్దకు వచ్చేసరికి అకస్మాత్తుగా బస్ స్టాప్ ను ఢీకొనడంతో దానిలో ప్రయాణిస్తున్న దువ్వాడ కు చెందిన రైల్వే ఉద్యోగి తరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* తూర్పు లద్దాఖ్​లో సరిహద్దు వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించిన చైనాకు భారత సైన్యం దీటుగా సమాధానమిచ్చిందని సైన్యాధిపతి ఎమ్​ఎమ్​ నరవాణే అన్నారు.

* ఇండోనేషియా దేశంలో సంభవించిన భారీ భూకంపం వల్ల మృతుల సంఖ్య 35కు పెరిగింది. ఇండోనేషియాలోని సులావేసి దీవుల్లో మజేన్‌కు నగర సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం వల్ల 630 మంది గాయపడ్డారు.

* విజయవాడ కె.టి రోడ్డులోని ప్రమాదం..ఆటో డ్రైవర్ అధికం వేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు..గాయాలపాలైన చిన్నారులు, వృద్ధుడు.

* అనంతపురం జిల్లా గుంతకల్లు రూరల్ పోలీసులు ముగ్గుర్ని అరెస్టు చేసి 1920 టెట్రా పాకెట్లు, ఆటో స్వాధీనం చేసుకున్నారు.