Movies

బజారురౌడీగా

బజారురౌడీగా

హృద‌య‌ కాలేయం, కొబ్బరిమ‌ట్ట.. వంటి వినూత్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంపూర్ణేశ్‌బాబు. ఈసారి ‘బజార్‌ రౌడీ’గా మారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా షూటింగ్‌ కూడా దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గుంటూరులోని కొండవీడు ప్రకృతి అందాల మధ్యలో తాజాగా ఓ పాటను చిత్రీకరించారు. సంపూర్ణేశ్ బాబు సరసన మహేశ్వరివద్ది హీరోయిన్‌గా కనిపించనుంది.కేఎస్‌ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో సందిరెడ్డి శ్రీనివాస‌రావు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో సినిమా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సాయి కార్తిక్‌ సంగీతం అందిస్తున్నాడు. నాగినీడు, షాయాజిషిండే, పృథ్వీ, ష‌ఫి, స‌మీర్‌, మ‌ణిచంద‌న‌, న‌వీన‌, ప‌ద్మావ‌తి, క‌త్తి మ‌హేశ్‌ త‌దిత‌రులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.