Politics

శశికళ ఎమర్జెన్సీకి కారణం కరోనా

శశికళ ఎమర్జెన్సీకి కారణం కరోనా

అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళకు కరోనా వైరస్‌ సోకింది. బెంగళూరులోని సెంట్రల్‌ జైలులో అస్వస్థతకు గురైన శశికళను జైలు అధికారులు బుధవారం స్థానిక లేడీ క్యూర్‌జోన్‌ ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. జ్వరం, వెన్నునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఆమెకు గురువారం కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. తొలుత యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గానే తేలినప్పటికీ.. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ జైలు నుంచి ఈ నెల 27న విడుదల కానున్నట్లు ఆమె తరపు న్యాయవాది రాజా సెంధూరపాండియన్‌ మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే.