DailyDose

హైకోర్టుకు హాజరైన డీజీపీ సవాంగ్-నేరవార్తలు

Crime News - AP DGP Sawang Attends High Court

* రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగడంపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి రాకేష్ తికాయిత్ సహా పలువురు రైతు నేతలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

* హైకోర్టు కు హాజరైన ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్..కోర్టు ధిక్కరణ పిటిషన్ లో కోర్టుకు హాజరైన డిజిపి..కోర్టు ఆదేశాలు ఇచ్చినా ప్రమోషన్ ను అమలు చేయలేదని పిటిషన్..తన సహచర ఉద్యోగి ప్రొసీడింగ్స్ ఆలస్యం కావటం వల్లే, కోర్టుకు ఆదేశాలు అమలు జరగలేదని తెలిపిన డిజిపి..ఇది మీ ఆఫీస్ కాదనీ, నిల్చొని సమాధానం ఇవ్వాలన్న హైకోర్టు..డిజిపి పదే పదే కోర్టుకి రావటానికి కింది స్థాయి ఉద్యోగులే కారణమన్న కోర్టు..వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు..కౌంటర్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశం..తదుపరి విచారణ ఫిబ్రవరి 25 కి వాయిదా..

* నందిగామ గాంధీ సెంటర్ లోని ఒక నూడిల్స్ పాయింట్ లో పేలిన గ్యాస్ సిలిండర్ భారీగా ఎగిసిపడుతున్న మంటలు మంటలను అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నం సంఘటనా స్థలానికి చేరుకున్న నందిగామ సీఐ కనకారావు. ఆ ఏరియా లో విద్యుత్ నిలిపి వేసిన విద్యుత్ శాఖ అధికారులు.

* తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆప్తురాలు వీకే శశికళ బుధవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. అవినీతి కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన శశికళ ఈనెల 20న కరోనా బారిన పడ్డారు. దీంతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శశికళ జైలు నుంచి విడుదల కానున్న నేపథ్యంలో దానికి సంబంధించిన తంతు అంతా ఆస్పత్రిలోనే పూర్తి చేశామని జైలు అధికారులు ప్రకటించారు. ఇవాళ జైలు నుంచి విడుదల అయినప్పటికీ.. ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జి అవుతారన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆమెకు కరోనా లక్షణాలేవీ లేవని వైద్యులు తెలిపారు.

* నెల్లూరుజిల్లా తడ ఉమ్మడి చెక్ పోస్ట్ లో ఏసిబి అధికారులు మెరుపు దాడులు..చాలాకాలం తర్వాత దాడులు నిర్వహించిన ఏసిబి..వరస ఫిర్యాదులు వస్తుండటంతో రంగంలోకి దిగిన ఏసిబి అధికారులు..తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్న సోదాలు ,పలు రికార్డులు స్వాధీనం..తడ చెక్ పోస్ట్ వద్ద పరారైన ప్రేవేట్ వ్యక్తులు..

* హైదరాబాద్‌ నగరంలోని వనస్థలిపురంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది.ఎస్‌.ఎస్‌.ఆర్‌ అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.