DailyDose

దుర్గ గుడిలో 13మంది ఉద్యోగుల సస్పెన్షన్-నేరవార్తలు

దుర్గ గుడిలో 13మంది ఉద్యోగుల సస్పెన్షన్-నేరవార్తలు

* దుర్గ గుడి ఉద్యోగులు సస్పెన్షన్‌..ఐదుగురు సూపరింటెండెంట్లు సహా 13 మంది సస్పెన్షన్‌..ఏసీబీ ప్రాథమిక నివేదిక ఆధారంగా దుర్గగుడి ఉద్యోగులపై చర్యలు..విజయవాడ దుర్గ గుడిలో పని చేసే ఐదుగురు సూపరింటెండెంట్‌ స్థాయి సిబ్బందితో సహా మొత్తం 13 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది..గుడిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన అనంతరం అందజేసిన నివేదిక మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది..గుడి భూములు, షాపుల లీజు వ్యవహారాలతో పాటు అన్నదానం, దర్శనాల టికెట్ల అమ్మకం, అమ్మవారి చీరల వ్యవహారాల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అందించిన ప్రాథమిక సమాచారం మేరకు ఏడు రకాల విభాగాల్లో పని చేసే సిబ్బందిని తక్షణమే సస్పెండ్‌ చేయాల్సిందిగా ఆలయ ఈవో సురేష్‌ బాబును ఆదేశిస్తూ దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ అర్జునరావు సోమవారం రాత్రి ఉత్తర్వులిచ్చారు.

* ఒడిశాలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా దాడికి పాల్పడాలనుకున్న మావోయిస్టుల కుట్ర భగ్నమైంది.మల్కాన్​గిరి జిల్లా జోదమాబా పోలీస్ స్టేషన్ పరిధిలోని కడాలిబంద అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించిన బీఎస్ఎఫ్ జవాన్లు.. భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.

* కర్ణాటకలోని చిక్కబలపూర్ లో బారి పేలుడు.క్వారీ వద్ద మైనింగ్ ప్రదేశంలో వైరింగ్ చేస్తుండగా బామ్ బ్లాస్ట్.క్వారీలో పనిచేస్తున్న ఆరుగురు సిబ్బంది అక్కడికక్కడే మృతి.ముగ్గురికి తీవ్ర గాయాలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

* టీటీడీపై బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ‘‘శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన విరాళాల వివరాలను టీటీడీ భక్తులకు తెలియచేయాలి.ఈ ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులను దేవాలయాల నిర్మాణానికి వినియోగిస్తామని చెప్పారు.ఇప్పటి వరకు ఏమి చేసారో టీటీడీ భక్తులకు వివరించాలి.హిందూ ధర్మపరిరక్షణ మాటలలో… కట్టు బొట్టులో ఉంటే సరిపోదు… ఆచరణాత్మకంగా చేసి చూపాలి’’ అంటూ ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు.

* మధ్యప్రదేశ్​లోని ఇండోర్​ శివార్లలో.. ఆగి ఉన్న ట్యాంకర్​ను ఓ కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.