Devotional

TNI ఆధ్యాత్మిక వార్తా తరంగిణి

Today's Hindu Spiritual Devotional News Roundup In Telugu

* మహాభారతం లోని ముఖ్య మయిన ఘట్టములలో ఒకటి పాండవుల వనవాసం, వారి అఙాతవాసం. మరి పాండవులు వారి అఙాతవాసంను విరాటరాజు కొలువులో గడిపారు. మరి అక్కడ వారు ఏ పేర్లతో, ఏమి పని చేస్తూ గడిపారు? ఇప్పుడు తెలుసుకుందాం!ధర్మరాజు – కంకుభట్టు అనే పేరుతో రాజా ఆస్థానంలోని ప్రవేశించాడు. రాజు కు మానసిక ఉల్లాసం కలిగించే శాస్త్ర చర్చలు చేయటం, స్నేహపూర్వకమయిన జూదం ఆడటం అతను చేస్తూ ఉంటాడు. అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు జయుడు.భీముడు- వలలుడు అనే పేరుతో ఒక వంటవానిగా విరాట రాజు వద్ద చేరాడు. ఇతని వంట అద్భుతం. వంట మాత్రమే కాక మల్ల విద్య కౌశలం కూడా ప్రదర్శించే వాడు. అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు జయంతుడు.అర్జునుడు- బృహన్నల అంటే పేడి వానిగా విరాటుని ఆశ్రయించాడు. ఇతను స్వర్గంలో ఉన్న సమయంలో ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఇలా వాడుకున్నాడు. అంతే కాక స్వర్గంలో ఉన్న సమయంలో నేర్చుకున్న సంగీత, నృత్య శాస్త్రములను అంతఃపురంలోని కన్యలకు నేర్పించేవాడు. అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు విజయుడు.నకులుడు – దామగ్రంథి అనే పేరుతో అశ్వశిక్షకుడుగా అక్కడ చేరాడు. అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు విజయత్సేనుడుసహదేవుడు – తంత్రీపాలుడు అనే పేరు తో గోసంరక్షకుడుగా చేరాడు. అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు జయద్బలుడు.ద్రౌపది – మాలిని అనే పేరుతో విరాటుని అంతఃపురంలో అతని రాణి సుధేష్ణ వద్ద సైరంద్రి గా ఉన్నది. అయితే పాండవులకు మరొక పేరూరు ఉన్నట్లు, వారు ద్రౌపదికి మరో పేరు సంకేతనామం గా పెట్టుకొనలేదు.

* శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 2 నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగనున్న నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది.

* శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనంశ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 2 నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగనున్న నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.ఈ సందర్భంగా మంగ‌ళ‌వారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6 నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఉదయం 11.00 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.పరదాలు విరాళం :తిరుపతికి చెందిన శ్రీ నరసింహులు రెండు పరదాలు, రెండు‌ కురాళాలు ఆలయానికి విరాళంగా అందించారు. రానున్న బ్రహ్మోత్సవాల్లో వీటిని వినియోగించనున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీ‌నివాసులు‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.ఏకాంత‌గా శ్రీ ‌క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్స‌వాలుశ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వర‌‌స్వామివారి ఆల‌యంలో మార్చి 2 నుండి 10వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను కోవిడ్ -19 నేప‌థ్యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు. మార్చి 1న సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు పుణ్యాహ‌వాచ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వ‌ము, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.

* భీష్మ ఏకాదశి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని లోక‌క‌ల్యాణం కోసం తిరుమల నాదనీరాజనం వేదికపై మంగ‌ళ‌వారం ఉద‌యం టిటిడి చేప‌ట్టిన శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం భ‌క్తిభావాన్ని పంచింది. ప‌లువురు భ‌క్తులు నేరుగా పాల్గొన‌గా, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ల‌క్ష‌లాది మంది భ‌క్తులు త‌మ ఇళ్లలోనే పారాయ‌ణం చేశారు. వేదిక‌పై చిన్న‌శేష వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని, ప‌క్క‌న‌ శ్రీ భీష్మాచార్యుల ప్ర‌తిమ‌ను, చిన్న ర‌థాన్ని కొలువుదీర్చి మంగ‌ళ‌హార‌తి స‌మ‌ర్పించారు.

* టిటిడి త్వ‌ర‌లో నిర్వ‌హించనున్న క‌ల్యాణ‌మ‌స్తు, శ్రీ‌నివాస క‌ల్యాణాలు లాంటి ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో ఆయా ప్రాంతాల్లోని శ్రీ‌వారి సేవ‌కులు త‌మవంతు స‌హ‌కారం అందించి సేవ‌లందించాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి కోరారు.

* శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు-2021 నిర్వహణ, ఏర్పాట్లపై ఈ రోజు ఉదయం శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి కార్యాలయ సమావేశ భవనంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ మరియు జిల్లా ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, శ్రీశైలం దేవస్థానం ఈ.ఓ.రామారావు, డి.ఆర్.ఓ.పుల్లయ్య, అన్ని శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, శ్రీశైల దేవస్థానం అధికారులు.

* మార్చి 4 న గౌ. భారత ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు తిరుపతి, తిరుమల పర్యటన నిమిత్తం జిల్లా కు రానున్నారని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

* తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 4 నుండి 13వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను కోవిడ్ -19 నేప‌థ్యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.

* నిన్న ఫిబ్రవరి 22 వ‌ తేదీన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 54,855 మంది…నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 3.38 కోట్లు.నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 27,632 మంది…తిరుపతిలో ప్రతి రోజు సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకన్లు జారీ చేస్తున్న టిటిడి…అలిపిరి భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో పరిమిత సంఖ్యలో టోకన్లు ఇస్తున్న టిటిడి..