Movies

కీరవాణికి ట్యూన్ బాలేదని చెప్పిన జక్కన్న

కీరవాణికి ట్యూన్ బాలేదని చెప్పిన జక్కన్న

కీరవాణి-రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ఎన్నో హిట్ చిత్రాలొచ్చాయి. శ్రోతల నాడి బాగా తెలిసిన ఈ ఇద్దరు ‘స్టూడెంట్‌ నెం.1’కి ముందుగా ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి’, ‘పడ్డానండి ప్రేమలో మరి’ పాటలు సిద్ధం చేశారు. ఓకే చేసేందుకు ఓసారి రాజమౌళిని వినమని చెప్పారు దర్శకేంద్రుడు. వాటిని విన్న రాజమౌళి ‘ఎక్కడో పుట్టి’ సరే అనుకుని, ‘పడ్డానండి ప్రేమలో మరి’ ఈ ట్యూన్‌ ఏంటి బాబోయ్‌.. అనుకుంటూ కీరవాణి దగ్గరకు వెళ్లి తన అభిప్రాయం చెప్పారు. ‘పెద్దన్నా..! ఏంటి ఈ ట్యూన్‌ ఇలా ఉంది. అసలేం బాలేదు. నాకు నచ్చలేదు’ అనగానే ‘హిట్‌ అవుతుందిరా.. రాఘవేంద్రరావు గారు ఓకే చేశారంటే అది పెద్ద హిట్‌ అయినట్టే’ అని సమాధానం ఇచ్చారు కీరవాణి. ఈ మాటతో ఆ పాటను సినిమాలో ఉంచారు రాజమౌళి. ఆడియో విడుదలై ఈ పాట పెద్ద హిట్‌ అయినపుడు ఓహో! మనం అయితే ఏం పాట చేయించుకునేవాళ్లమో, అది ఏం అయ్యేదో అని మనసులో అనుకున్నానని ఓ సందర్భంలో తెలియజేశారు జక్కన్న. ఈ సినిమాలోని ఒకటి.. రెండు కాదు సినిమాలోని ఆరు పాటలూ హిట్ గీతాలుగా నిలిచాయి. చిత్ర ఘన విజయానికి ప్రధాన కారణమయ్యాయి.