Devotional

24 నుండి శ్రీవారి తెప్పోత్సవం-TNI ఆధ్యాత్మిక తరంగిణి

TNI Devotional News - Teppotsavam From 24th

మార్చి 24 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు. తిరుమలలో మార్చి 24 నుంచి 28వ తేదీ వరకు ఐదు రోజులపాటు శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి. తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు.

##########

చమత్కార గణపతి!

” జనకునకు న్విసంబిడిన సాగరుతోయములన్నినేలపా
లొనరగఁజేతునంచు గరమూదిన గౌరియుజూచి”వద్దురా!
తనయ! సురేంద్రుధాటి కిటుదాగిన మామను బైటవేతువా ?”
యనినఁ గరమ్ముఁదీసిన గజాస్యునిఁ గొల్తు నభీష్ఠ సిధ్ధికిన్.
—-చాటుపద్యం.

బాలగణపతి ఆటలాడుకుంటూ తల్లి దగ్గరకు వచ్చి అడిగాడట!”అమ్మా! నాన్నగారి ఒళ్ళంతా తెల్లగా ఉంది. మరి ఆ కంఠం నల్లగా ఉందేమిటమ్మా!”-అని, దాని కావిడ “అయ్యో!ఏమి చెప్పమంటావురా! మీ నాన్న పనికి వచ్చే పనులొక్కటైనా చేయరు. పైగా చేసేవన్నీ తనకు చేటు వచ్చే పనులే..! అమృతం కోసం దేవతలందరూ పాల సముద్రాన్ని మధిస్తుంటే, చింతామణి, కామధేనువు కల్పవృక్షాలు, ఐరావతం, ఉఛ్ఛైశ్రవాది దివ్యవాహనాలు సంపదల తల్లి లక్ష్మీదేవి వంటి అనర్ఘ రత్నాలు దొరికాయి. సముద్రుడు వాటినన్నిటినీ దేవతలకిచ్చాడు. ఆ మీద “భయంకరమైన మంటలతో కాల కూట విషం పుట్టింది. దేవతలందరూ మీ నాన్నను పొగడి ఉబ్బేస్తే ఈ బోళాశంకరుడు ఆ విషాన్నంతా త్రాగి వచ్చాడురా! అదిగో ఆ కంఠం నలుపుకు అదీ కారణం.”-అన్నది. వేంటనే గణనాధుడు కోపంతో-“ఔరా! సముద్రుడా! మానాన్నకు విషంపెడతావా? చూడు నిన్ను నామరూపాలు లేకుండా చేస్తా” నంటూ తొండం సారించి ముందుకు అడుగులేస్తున్నాడు. ఇంతలో పార్వతి అతని కడ్డుగా నిలచి”నాయనా సముద్రుని రూపు మాపితే అందులో దాగిన మీ మేనమామ బయటపడితే ప్రమాదం రా! పర్వతాల రెక్కలు నరికిన దేవేంద్రునకు వెరచి దాగిన మీ మేనమామకు గండమే!” తద్వారా నాకు పుట్టిల్లే కరువౌతుంది. వద్దు నాయనా! వెనక్కురా!అని బుజ్జగించిందట! “అలాగా ! నాకీసంగతి తెలియదే!పోనీలే అంటూ తొండాన్ని వెనక్కు దీసికొని వచ్చి తల్లి ఒడిలో కూర్చున్నాడట! అలాంటి బాలగణపతి మనకు, ,ఆయురారోగ్య భాగ్యము లొసంగి రక్షించుగాక!🙏

########

💐గ్రామ దేవతల పేర్లు💐💐
విజయవాడ దుర్గమ్మ తల్లి సాక్షిగా…!!!!

💐గ్రామదేవతలు 101 మంది అక్కాచెల్లెళ్ల పేర్లు :-💐

పార్వతి అమ్మోరు (అమ్మవారు )గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం .

ఈ అమ్మోరు మొత్తం 101 మంది అక్కాచెల్లెళ్లు అని వీరందరికి ఒకేఒక్క తమ్ముడు పోతురాజు అని అంటారు .వారిలో కొందరు .

1.పాగేలమ్మ
2.ముత్యాలమ్మ
3 .గంగమ్మ
4.గంగానమ్మ
5.బంగారమ్మ
6.గొంతెమ్మ
7.సత్తెమ్మ
8.తాళమ్మ
9.చింతాలమ్మ
10.చిత్తారమ్మ
11.పోలేరమ్మ
12.మావుళ్లమ్మ
13.మారెమ్మ
14.బంగారు బాపనమ్మ
15.పుట్టానమ్మ
16.దాక్షాయణమ్మ
17.పేరంటాలమ్మ
18.రావులమ్మ
19.గండిపోచమ్మ
20.మేగదారమ్మ
21.ఈరినమ్మ
22.దుర్గమ్మ
23.మొదుగులమ్మ
24.నూకాలమ్మ (అనకాపల్లి ,విశాఖజిల్లా )
25.మరిడమ్మ
26.నేరెళ్లమ్మ
27.పుంతలో ముసలమ్మ (మెయ్యెరు ,అత్తిలిదగ్గర ,పశ్చిమగోదావరిజిల్లా )
28.మాచరమ్మోరు
29.మద్ది ఆనాపా అమ్మోరు
30.సొమాలమ్మ
31.పెద్దయింట్లమ్మ
32.గుర్రాలక్క (అంతర్వేది ,తూర్పుగోదావరిజిల్లా గుర్రాలమ్మ )
33 .అంబికాలమ్మ
34.ధనమ్మ
35.మాలక్షమ్మ
36.ఇటకాలమ్మ
37.దానాలమ్మ
38.రాట్నాలమ్మ
39.తలుపులమ్మ
40.పెన్నేరమ్మ
41.వెంకాయమ్మ
42.గుణాళమ్మ
43.ఎల్లమ్మ (విశాఖపట్నం )
44.పెద్దమ్మ
45.మాంటాలమ్మ
46.గంటాలమ్మ
47.సుంకులమ్మ
48.జంబులమ్మ
49.పెరంటాలమ్మ
50.కంటికలమ్మ
51.వణువులమ్మ
52.సుబ్బాలమ్మ
53.అక్కమ్మ
54.గనిగమ్మ
55.ధారాలమ్మ
56.మహాలక్షమ్మ
57.లంకాలమ్మ
58.దోసాలమ్మ
59.పళ్ళాలమ్మ (వానపల్లి ,తూర్పుగోదావరిజిల్లా )
60.అంకాళమ్మ .
61.జోగులమ్మ
62.పైడితల్లమ్మ
63.చెంగాళమ్మ
64.రావులమ్మ
65.బూరుగులమ్మ
66.కనకమహాలక్ష్మి (విశాఖపట్నం )
67.పోలమ్మ
68.కొండాలమ్మ
69.వెర్నిమ్మ
70.దే శిమ్మ
71.గరవాలమ్మా
72.గరగలమ్మ
73.దానెమ్మ
74.మహాంకాళమ్మ
75.వేరులమ్మ
76.మరిడమ్మ
77.ముళ్ళ మాంబిక
78.యలారమ్మ
79.వల్లూరమ్మ
80.నాగులమ్మ
81.వేగులమ్మ
82.ముడియలమ్మ
83.రేణుకమ్మ
84.నంగాలమ్మ
85.చాగాలమ్మ
86.నాంచారమ్మ
87.సమ్మక్క
88.సారలమ్మ
89.మజ్జిగౌరమ్మ
90.కన్నమ్మ -పేరంటాలమ్మ
91.రంగమ్మ -పేరంటాలమ్మ
92.వెంగమ్మ -పేరంటాలమ్మ
93.తిరుపతమ్మ
94.రెడ్డమ్మ
95.పగడాలమ్మ
96.మురుగులమ్మ (బండారులంక ,తూర్పుగోదావరిజిల్లా )
97.కుంచమ్మ విశాఖపట్నంలో
98.ఎరకమ్మ
99.ఊర్లమ్మతల్లి
100.మరిడమ్మ
101.సుంకాలమ్మవ్వ ఉన్నారు .

💐నుసకపల్లి ,పామర్రమండలం తూర్పుదోదావరిజిల్లాలోని గ్రామదేవతలు .

1.నుసకపల్లమ్మ
2.వెలగలమ్మ
3 .ఊర్లమ్మతల్లి (గణపవరం ,కర్లపాలెం మండలం ,గుంటూరుజిల్లా )
4.పైళ్లమ్మతల్లి
5.బల్లమ్మతల్లి
6.లొల్లాలమ్మతల్లి
7.ఊడలమ్మ తల్లి
8.కట్వాలాంబిక
9.నాగాలమ్మ నాంచారమ్మతల్లి
10.సింగమ్మతల్లి
11.ఘట్టమ్మతల్లి
12.అంజారమ్మతల్లి .
13. మంత్రాలమ్మ తల్లి
14.పాతపాటేశ్వరి తల్లి
15.కుంకుళమ్మ ద్వారకా తిరుమల
16.చౌడమ్మ నందవరం కర్నూల్ జిల్లా

అలాగే ఖమ్మం ,నల్గొండ జిల్లాలలో ముత్యాలమ్మ తల్లి ఆరాధన ఎక్కువగా కానవస్తుంది .

💐అమ్మలగన్న అమ్మలు ఆదిపరాశక్తిలు గ్రామదేవతలకు వందనాలు,💐

💐💐మన గ్రామదేవతలు ఎలా వెలిశారు ?💐💐

మనం రకరకాల పేర్లతో పిలిచే గ్రామదేవతల నామ విశేషాలేమిటి?

💐గ్రామదేవతా వ్యవస్థ:💐

గ్రామాలలో వెలిసే దేవత…దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపాలను గ్రామదేవతలని అంటారు.

సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు.

ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు,
ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా – అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో,కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే
కుదరకపోవచ్చు.

ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము
సాద్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో
అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు
ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే
తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు.

ఈ దేవతా ప్రతిష్ఠ గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త,
ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది.

ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు
అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో
అలాంటి వారిని వారి కోరిక మేరకు అర్చకులుగా
నియమించారు పూర్వీకులు.

అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు.

దేవతా విగ్రహప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహించబడింది
కాబట్టి, ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము
సరైన మూహూర్తములోనే జ్ వేయబడింది కాబట్టి
గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు-

భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు.

అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిష్ఠ జరిగిన
ఆ నెల, ఆ తిథినాడు ఖచ్చితముగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడమువలన అమ్మకి మన ద్వారాఏదైనా లోటు పాట్లు కలిగివుంటే తొలగుతుంది.

💐💐గ్రామదేవతల ఆవిర్భావము:💐💐

పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది.

#########

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజైన బుధవారం మోహిని అవతారంలో శ్రీరామచంద్రుడు పల్లకిలో కనువిందు చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో పల్లకి సేవ ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.

#######

మహమ్మారి వైరస్‌ నిరోధానికి తీసుకువచ్చిన వ్యాక్సిన్‌ వృథా అవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాక్సిన్‌ వృథా చేయడంలో తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని ప్రకటించింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం తర్వాతి స్థానంలో ఉందని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సిన్‌ నిల్వ చేయడంలో.. భద్రపర్చడంలో.. టీకా వేసే సమయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంతో వ్యాక్సిన్‌ వృథా అవుతోందని అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారీగా వ్యాక్సిన్‌ వృథా వివరాలను పట్టిక రూపంలో ప్రదర్శించింది. వాస్తవంగా వ్యాక్సిన్‌ వృథాను పది శాతంలోపు ఉండాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే పది శాతానికి కన్నా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయి. అత్యధికంగా తెలంగాణ 17.6 శాతం వ్యాక్సిన్‌ వృథా చేసింది. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ 11.6 శాతం వృథా చేసి రెండో స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌ 9.4 శాతం వృథా చేసి మూడో స్థానంలో ఉంది. కర్నాటక మాత్రం జాతీయ రేటు 6.5 శాతం సమీపంలో 6.9 శాతంగా ఉంది. ఇదే నేపథ్యంలో కరోనా తీవ్రరూపంలో వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాలకు కొన్ని సలహాలు ఇచ్చింది. రాష్ట్రాలకు మొత్తం 7.54 కోట్ల డోస్‌ల వ్యాక్సి్‌న్‌ పంపిణీ చేసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జనవరి 16వ తేదీన భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్‌ ఇప్పటివరకు 3.58 కోట్ల మందికి పంపిణీ చేసినట్లు వెల్లడించింది. మార్చి 15 వరకు 8 మిలియన్ల డోస్‌లు పంపిణీ చేయాలని లక్ష్యం విధించుకున్నట్లు పేర్కొంది.