DailyDose

మహిళా కానిస్టేబుల్‌పై కత్తితో దాడి-నేరవార్తలు

మహిళా కానిస్టేబుల్‌పై కత్తితో దాడి-నేరవార్తలు

* అనంతపురం పోలీసులు సమన్వయంతో ఒక యువకుడి ప్రాణాలు కాపాడారు.కాసేపట్లో రైలు వస్తే ఆ యువకుడి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితుల్లో చాకచక్యంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ యువకుడిని రక్షించారు.డయల్ – 100 విభాగం ఇచ్చిన సమాచారం మరియు పోలీసుల సమన్వయం ఇందుకు దోహదం చేసింది.వివరాలు… అనంతపురం జిల్లా నార్పల కు చెందిన సతీష్ కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఓ స్వచ్ఛంద సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.

* అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన మహిళ హత్య కేసులో నిదింతుడైన ఆమె భర్త చిక్కనయ్యను పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన్ సీఐ జాకీర్ హుస్సేన్ తెలిపిన వివరాల ప్రకారం..కనెకల్లుకు చెందిన చిక్కనయ్యకు కర్నూలు జిల్లాకు చెందిన కవితతో 2008 సంవత్సరంలో వివాహమైంది.వీరికి ఇద్దరు పిల్లలు కాగా.. స్థానిక జీసెస్ నగర్​లో నివాసం ఉంటున్నారు.ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న నిందితుడు భార్యపై అనుమానం పెంచుకున్నాడు.ఇదే విషయమై భార్యభర్తలిద్దరూ శుక్రవారం తెల్లవారుజామున గొడవపడ్డారు.విచక్షణ కోల్పోయిన చిక్కనయ్య కవితను హత్య చేశాడు.

* ఏపీలోని పలు నగరాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది.గుంటూరు, తిరుపతి, విశాఖపట్నంలో సీబీఐ బృందాలు దాడులకు పాల్పడ్డాయి.పలు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఎగవేసిన వారిపై దాడులు నిర్వహిస్తున్నారు.దేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకుల నుంచి 3 వేల 700 కోట్ల రూపాయలు ఋణం తీసుకొని ఎగవేసినట్టు సీబీఐ పేర్కొంది.నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో రుణాలు, రుణాల మళ్లింపు, మోసంపై కేసులు నమోదుకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను సీబీఐ స్వాధీనం చేసుకుంది.

* కోవూరులో మహిళపై కానిస్టేబుల్ కత్తితో దాడికి దిగాడు. తీవ్ర గాయాలపాలైన మహిళను కోవూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది.

* పాతబస్తీలోని బహదూర్‌పురలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.నాలుగు గోదాంలలో మంటలు చెలరేగి ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.ఒకదాని పక్కన ఒకటి ఉన్న వాహన విడిభాగాలు, బొగ్గు, మరో 2 గోదాముల్లో మంటలు చెలరేగాయి.ఘటనా సమయంలో గోదాముల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

* బంగాల్​లో ఎన్నికల వాహనానికి నిప్పటించిన దుండగులు.​బంగాల్​లో తొలి దశ ఓటింగ్​కు కొన్ని గంటల ముందు ఎన్నికల విధుల కోసం ఉపయోగించిన ఓ వాహనానికి నిప్పంటించారు దుండగులు.పురులియా జిల్లాలోని బంద్వాన్​లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.పోలింగ్ స్టేషన్​లో అధికారులను విడిచి వెళ్తున్న క్రమంలో నక్సల్ ప్రభావిత ప్రాంతం జంగల్​ మహల్​లోని తుల్సిడిలో వాహనంపై పెట్రోల్​ పోసి నిప్పంటించినట్లు స్థానికులు తెలిపారు.అటవీ ప్రాంతం నుంచి కొందరు ఆకస్మికంగా రోడ్డుపైకి వచ్చి వాహనాన్ని అడ్డుకున్నట్లు చెప్పారు.