Devotional

భక్తులు భద్రాద్రి రావొద్దు-TNI ఆధ్యాత్మిక వార్తలు

భక్తులు భద్రాద్రి రావొద్దు-TNI ఆధ్యాత్మిక వార్తలు

* భద్రాద్రిలో శ్రీరామ‌ న‌వ‌మి వేడుక‌లను నిరాడంబ‌రంగా నిర్వహించాల‌ని తెలంగాణ‌ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. తెలంగాణ‌ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గ‌త ఏడాది నిర్వహించిన‌ట్లుగానే కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ను జ‌రుపుతామని తెలిపారు. భక్తులెవరూ సీతారామ కల్యాణాన్ని చూడ‌డానికి భద్రాద్రికి రావద్దని చెప్పారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా భక్తుల రాకపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో చూడాల‌ని తెలిపారు. ఆన్‌లైన్లో ఇప్ప‌టికే క‌ల్యాణ‌ టిక్కెట్లు బుక్ చేసుకున్న భ‌క్తులకు ఆ డ‌బ్బులను తిరిగి చెల్లిస్తామ‌ని వివ‌రించారు. అంతేగాక‌, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రామాల‌యాల్లో కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే భ‌క్తుల‌కు ద‌ర్శనాలు క‌ల్పిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

* అనంతపురం జిల్లా మండల కేంద్రం చిలమత్తూరులో ఆదివారం భునీలా సమేత కనుమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం సందర్భంగా పలు సంఘాల ప్రతినిధులు భక్తుల ఆకలి తీర్చారు….వేలాది మంది భక్తుల నడుమ… గోవింద నామ స్మరణలతో స్వామి వారి రథోత్సవం ముందుకు సాగింది…మధ్యాన్నం 2 గంటల అనంతరం రథోత్సవం ప్రారంభమైంది… ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు విచ్చేయడంతో నీళ్లు, అన్నము లభించక తీవ్ర ఇబ్బందులు పడ్డారు… అయితే 1981-82 ఎస్ ఎస్ సి బ్యాచ్ హైస్కూల్ పూర్వ విద్యార్థులతోపాటు వివిధ సంఘాల వారు పెద్ద ఎత్తున అన్నదానం, మజ్జిగ పంపిణీ చేయడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులకు కాస్త ఉపశమనం లభించింది…

* 🕉 నిన్న మార్చి 27 వ‌ తేదీన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 53,567 మంది…‌ ‌🕉 నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 2.69 కోట్లు.🕉 నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 28,109 మంది…🕉 తిరుపతిలో ప్రతి రోజు సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకన్లు జారీ చేస్తున్న టిటిడి…🕉‌ అలిపిరి భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో మరుసటి రోజులకు పరిమిత సంఖ్యలో టోకన్లు ఇస్తున్న టిటిడి.

* ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు హోళీ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. అయితే, క‌రోనా వైర‌స్ మళ్లీ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ప్ర‌జ‌లు వీధుల్లో గుంపులుగా చేరకుండా ఎవ‌రి ఇండ్ల‌లో వారే ప్ర‌శాంతంగా పండుగ చేసుకోవాల‌న్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బ‌హిరంగ ప్ర‌దేశాల్లో గుమిగూడ‌టంవ‌ల్ల క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రింత వేగంగా ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు. అంద‌రూ కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ వైర‌స్ క‌ట్ట‌డిలో త‌మ వంతు పాత్ర పోషించాల‌ని సీఎం కేసీఆర్‌ కోరారు.

* కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మత సంబంధిత సామూహిక కార్యక్రమాలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులపై ఆంక్షలు విధించింది. బహిరంగ స్థలాలు, పని ప్రదేశాలు, ప్రజారవాణా వ్యవస్థల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సామూహిక కార్యక్రమాలతో కరోనా వ్యాప్తికి ఎక్కువ ముప్పు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఏప్రిల్‌ 30 వరకు ఆంక్షలు విధించినట్టు పేర్కొన్నారు. షబ్‌–ఏ–బరాత్, హోలీ, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్‌ జయంతి, గుడ్‌ఫ్రైడే, రంజాన్‌ తదితర వివిధ మతాల పండుగలు, ఉత్సవాలకు అనుమతించడం లేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని బహిరంగ స్థలాలు, మైదానాలు, పార్కులు, ప్రార్థనా స్థలాల్లో మత సంబంధిత ర్యాలీలు, ఊరేగింపులు, ఉత్స వాలు, సామూహిక కార్యక్రమాలు, సమావేశాలను అనుమతించబోమని పేర్కొన్నారు. ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం–2005, సంబంధిత ఇతర చట్టాల కింద కేసులు పెడతామని హెచ్చరించారు. మాస్క్‌లు ధరించనివారిపై విపత్తుల నిర్వహణ చట్టంతో పాటు ఐపీసీలోని సెక్షన్‌ 188 కింద కేసులు పెడతామని తెలిపారు. ఈ ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు/ఎస్పీలను ఆదేశించారు. దేశం లో మళ్లీ కోవిడ్‌–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షలు విధించుకోవడానికి అనుమతిస్తూ ఈ నెల 23న కేంద్ర హోంమంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీ చేసిన విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభు త్వం రాష్ట్రంలో ఆంక్షలు విధించింది.