DailyDose

కిడ్నీ అమ్ముకునేందుకు అనుమతి కోరుతున్న విద్యార్థిని-నేరవార్తలు

కిడ్నీ అమ్ముకునేందుకు అనుమతి కోరుతున్న విద్యార్థిని-నేరవార్తలు

* చిత్తూరు జిల్లా పలమనేరు మండలం….ఒంటరి ఏనుగు చేతిలో యువకుడు జానకి రామ్ (27) బలి…పలమనేరు మండలం కాలవపల్లి గ్రామం నందు నిన్న రాత్రి ఒంటరిగా ఏనుగు పంట పొలాల్లో యువకుడిని తొక్కి చంపింది..వివరాల్లోకి వెళితే అర్ధరాత్రి సమయంలో మోటర్ వేయడానికి వెళ్లిన జానకి రామ్ కి ఏనుగు తారస పడడంతో అతని పైన ఏనుగు దాడి చెయ్యడం తో అతను మృతి చెందాడు….తండ్రి పేరు త్యాగరాజు అతను కాలవపల్లి చెక్పోస్ట్ నందు విధులు నిర్వహిస్తున్నాడు.

* ఏపీలోని 3వేల ప్రైవేటు హాస్పిటల్స్ గల్లఒతు.!అనుమతి ప్రక్రియ ఆన్‌లైన్‌ కావడమే కారణం.అనుమతులూ,రెన్యువల్‌ రెండూ ఇకపై కష్టమే.?5,619 ఆస్పత్రుల నుంచి రెన్యువల్‌ అభ్యర్థనలు.కొత్తగా అనుమతి కోరుతున్న 1,825 ఆస్పత్రులు.

* కుమార్తె ఎంబీబీస్ పరీక్ష ఫీజు కోసం కిడ్నీలు అమ్ముకుంటా అనుమతివ్వాలంటూ అనంతపురం జిల్లా, హిందూపురంకు చెందిన మక్బుల్ జాన్, ఆయూబ్ ఖాన్ దంపతులు కలెక్టర్‌ను వేడుకుంటున్నారు. ఫిలిప్పీన్స్‌లో తమ కుమార్తె రుబియా ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతోందన్నారు. అయితే విదేశీ ఉన్నత విద్య స్కాలర్ షిప్ మంజూరు కాలేదని, దాని కోసం రెండు నెలలుగా ప్రజా ప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని ఆ దంపతులు వాపోయారు. ఈనెల 17వతేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉండటంతో కిడ్నీలు అమ్మకానికి అనుమతించాలని రుబియా తల్లిదండ్రులు కలెక్టర్‌ను వేడుకుంటున్నారు.

* కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు ఈ ఉదయం నిర్వహించిన తనిఖీల్లో రూ.1.04 కోట్లు విలువైన బంగారం, వజ్రాభరణాలు పట్టుబడ్డాయి. హైదరాబాద్‌ నుంచి వీటిని మధురై తరలిస్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న బంగారం, ఆభరణాలకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు వాటిని సీజ్‌ చేశారు. బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.