Food

మానుషి మీట్ తినదు

Manushi Chillar Wont Eat Meat And Suggests Vegetarian

మానుషి చిల్లర్‌… ఒకప్పటి విశ్వ సుందరి ఇప్పుడు బాలీవుడ్‌ నటి. ప్రస్తుతం ఆమె అక్షయ్‌ కుమార్‌ సరసన ‘పుృద్వీరాజ్‌’ చిత్రంలో నటిస్తున్నారు. నటనతో పాటు ఆమె పలు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా జీవ కారుణ్య సంస్థ ‘పెటా’తో కలసి శాఖాహార ఆవశ్యకతను తెలియచెప్పే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఏప్రిల్‌ 22 ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘నచ్చిన ఆహారం తినే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కానీ మన ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం మాత్రమే తినాలి. శాఖాహారంతో కలిగే లాభాలు అపారం అని గ్రహించి నేను ఆ మార్గం ఎంచుకున్నాను. ఈ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరినీ శాఖాహారం తీసుకోమని కోరుతున్నాను. నా ఫిట్‌నెస్‌ రహస్యం శాఖాహారమే’’ అని మానుషి చెప్పారు.