Movies

ప్రగ్యా అదృష్టం

ప్రగ్యా అదృష్టం

‘‘ప్రస్తుత చిత్రసీమలో భాగం కావడం నా అదృష్టం’’ అంటోంది ప్రగ్యా జైశ్వాల్‌. ‘కంచె’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ నాయిక ప్రస్తుతం బాలకృష్ణతో ‘అఖండ’తో పాటు సల్మాన్‌ఖాన్‌ అతిథి పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న బాలీవుడ్‌ చిత్రం ‘అంతిమ్‌’లో నటిస్తోంది. నాయికలకు సంబంధించి చిత్రసీమలో చాలా మార్పులొచ్చాయని చెబుతోంది ప్రగ్య. ‘‘ఒకప్పటిలా చిత్ర పరిశ్రమ లేదు. అన్ని విధాలుగా పురోగతి కనిపిస్తుంది. హీరోలే కాదు నాయికలు కూడా ఏళ్ల తరబడి చిత్రసీమలో కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. పెళ్లైతే కెరీర్‌ ముగిసిపోతుందనేది ఒకప్పటి మాట. ఇప్పుడు పెళ్లైనా దూసుకుపోతున్న నాయికలు ఎందరో ఉన్నారు. కరీనా కపూర్‌, దీపికా పదుకొణె.. ఇలా వీళ్లందరూ టాప్‌ రేసులో ఉన్నారు’’అంటోంది ప్రగ్య. ‘అఖండ’లో నటించడం గురించి మాట్లాడుతూ ‘‘అఖండ’ రూపంలో ఓ భారీ చిత్రం నా ఖాతాలో చేరింది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. కానీ ఇంతలోనే కరోనా ప్రభావంతో చిత్రీకరణ ఆగింది. కొన్ని రోజుల తర్వాత సినిమా సెట్స్‌ మీదకు వెళుతుంది’’అని చెప్పింది ప్రగ్య.