Health

ఫార్మా ఇండస్ట్రీ సంచలన లాభాలు-TNI కోవిద్ బులెటిన్

ఫార్మా ఇండస్ట్రీ సంచలన లాభాలు-TNI కోవిద్ బులెటిన్

* నేడు ఏపీలో నమోదైన మొత్తం కరోనా కేసులు12768

* ఒక్క ఏప్రిల్, 2021 నెలలో ఫార్మా ఇండస్ట్రీ లాభాలు 59 శాతం పెరిగాయని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక రాసింది. ఇదీ కోవిడ్ మాయాజాలం. కార్డియాక్ థెరపీ, క్రానిక్ థెరపీ 22 శాతం, యాంటీబయాటిక్ థెరపీ 10 శాతం, విటమిన్స్, మినరల్స్, సప్లిమెంట్స్‌ (VMS) 80 శాతం ఈ ఒక్క నెలలో పెరిగినట్టు Emky global financial services report తెలిపింది. శ్వాసకోశ సంబంధిత చికిత్స ‌64% పెరిగింది.

* తెలంగాణ ప్రజలకు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి శుభవార్త చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణలో మరో రెండు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు.

* కొవిడ్ వ్యాధి నివారణా చర్యల్లో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది.రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1,00,74,471 మందికి మొదటి, రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యిందికేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు 98,85, 650 డోసులు అందాయన్నారు.ఇందులో కేంద్రం నుండి కోవిషీల్డ్ వ్యాక్సిన్ 66,82,570 డోసులు, కోవాగ్జిన్ 15,17,450 డోసులు అందగా, రాష్ట్ర ప్రభుత్వం 13,41,700 కోవిషీల్డ్ డోసులు, 3,43,930 కోవాగ్జిన్ డోసులు కొనుగోలు చేసింది.ఇప్పటి వరకూ కోవిషీల్డ్ వ్యాక్సిన్ 82,95,973 మందికి, కోవాగ్జిన్ 17,78,218 మందికి వేయించాము