NRI-NRT

తానా-సామినేని ఫౌండేషన్‌లచే పేద విద్యార్థులకు లాప్‌టాప్‌ల బహుకరణ

Samineni Foundation TANA Helps 5 Poor Students With laptops

ఉత్తర అమెరికా తెలుగు సంఘము – సామినేని ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో రెండున్నర లక్షల రూపాయిల విలువైన అయిదు లాప్‌టాప్‌లను అయిదుగురు పేద విద్యార్థులకు ఖమ్మం ఏసీపీ రామాంజనేయ చేతుల మీదుగ అందజేశారు. రెస్ట్ ఇన్ హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏసీపీ మాట్లాడుతూ ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ జీవితంలో ముందడుగు వేయాలని సూచించారు. సామినేని రవి , తానా చేయూత సమన్వయకర్త శశికాంత్ వల్లేపల్లి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సామినేని ఫౌండేషన్ అధ్యక్షులు సామినేని నాగేశ్వరరావు అన్నారు. కోటి రూపాయిల విలువైన వైద్య సామాగ్రి త్వరలో ఖమ్మం జిల్లాకు వస్తోందని తానా ఫౌండేషన్ ఇండియా ట్రస్టీ పసుమర్తి రంగారావు అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ కరుణాకర్, రెస్ట్ ఇన్ హోటల్ శ్రీదర్ మైనేని, ఎన్నారై ఫౌండేషన్ అధ్యక్షుడు బోనాల రామకృష్ణ, బండి నాగేశ్వర రావు, దొడ్డపనేని కృష్ణరావు, వాసిరెడ్డి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు