Movies

“మా” అధ్యక్ష పోటీలో ప్రకాష్‌రాజ్

“మా” అధ్యక్ష పోటీలో ప్రకాష్‌రాజ్

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. త్వరలో జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ బరిలో దిగనున్నారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. దీంతో ప్రకాశ్‌రాజ్‌కు పోటీగా ఎవరు బరిలోకి దిగుతారు?ఆయనకు ఎవరి మద్దతు ఉంటుంది? ఇలా అనేక అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. చిరంజీవి మద్దతు మీకు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి? మీరేమంటారు? అన్న దానికి ప్రకాశ్‌రాజ్‌ సమాధానం ఇస్తూ.. ‘చిరంజీవి అందరి వ్యక్తి. ఆయన వ్యక్తిగతంగా ఏ ఒక్కరికో మద్దతు ఇవ్వరు. మంచి చేస్తారని ఆయన భావించినవారికి మద్దతిస్తారు. అన్నయ్యతో నాకున్న సాన్నిహిత్యాన్ని దీని కోసం వినియోగించుకోను’ అని సమాధానం ఇచ్చారు.