ScienceAndTech

ఏపీలో ఇంటర్ పరీక్షలు లేవు. ఆగష్టు 19 నుండి ఎంసెట్-తాజావార్తలు

ఏపీలో ఇంటర్ పరీక్షలు లేవు. ఆగష్టు 19 నుండి ఎంసెట్-తాజావార్తలు

* ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలు రద్దు. విద్యా శాఖ మంత్రి – ఆదిములపు సురేష్.

* ప్రజాపిత బ్రహ్మకు కుమారీస్ ఈశ్వరయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మాతేశ్వరి జగదాంబ సరస్వతి 56వ స్మృతి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు . డాబాగార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఈ స్మృతి దినోత్సవ వేడుకల్లో జీవీఎంసీ అదనపు కమిషనర్ వి సన్యాసిరావు, యూసీడీ పిడి యాదగిరి శ్రీనివాస్ లు ముఖ్య ఆతిధులుగా హాజరై మాట్లాడుతూ ఆధ్యాత్మక భక్తిమయ జీవితానికి , మానసిక ప్రశాంతతకు బ్రహ్మకుమారీస్ చేస్తున్న కార్యమాలు ప్రశంసనీయమన్నారు .

* విశాఖ దొండపర్తి కూడలిలో కూల్చివేతకు గురైన భవనం అల్లిపురం శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి సంబంధించిన దేవస్థానం భూమి కాదని తమదేనంటూ కుమిలి సత్యవతి కుటుంబ సభ్యులు బూరాడ వెంకటరమణ, బూరాడ సుశీల, మార్నేడు సురేష్ కుమార్ లు ఆవేదన వ్యక్తం చేసారు. విజేఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో వారు మాట్లాడారు. దొండపర్తి నాలుగు రోడ్ల జంక్షన్ కి అనుకుని ఉన్న 635 గజల స్థల భవంతి తమదేనని ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించారు. రోడ్ విస్తరణలో 132 గజాలు పోను మిగిలిన స్థలంలో తమ అత్త మామలు కుమిలి సూర్యనారాయణ, కుమిలి సత్యవతి లకు 1969 నుండి ఆ భూములు దాఖలా పడి ఉన్నాయని వివరించారు. 1999లో దేవాదాయశాఖ ఆ ల్యాండ్ తమదంటూ కోర్టులో కేసు వేసిందని అయితే కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందన్నారు.

* ఈరోజు తుళ్లూరు మండలం ఉద్దండ్రాయునిపాలెం గ్రామ అమరావతి దీక్షా శిబిర పునః ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించిన రాజధాని మాజీ శాసనసభ్యులు గుంటూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్.

* ఏపీ ఏఒసెట్ షెడ్యూల్ ప్రకటన ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ నిర్వహణ

* ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది.

* జమ్ము కశ్మీర్​కు చెందిన 14 మంది నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం భేటీ అయ్యారు.

* తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం పండుగలా మారిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రైతన్నలు కాలంతో పోటీ పడుతూ పసిడి సిరులు పండిస్తున్నారన్నారు. సూర్యపేట నియోజకవర్గంలోని గాజుల మల్కాపురం గ్రామంలో రైతులతో కలిసి ఏరువాక కార్యక్రమాన్ని జగదీష్ రెడ్డి ప్రారంభించారు.

* 2019లో దేశంలో జనన, మరణాలకు సంబంధించిన తాజా జనాభా లెక్కలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తాజా గణాంకాల ప్రకారం దేశ జనాభా 133.89 కోట్లు.

* ఈ నెల 28 వ తేదిన హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో జరిగే భారత మాజి ప్రధాన మంత్రి శ్రీ పి.వి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు హాజరవుతారని, శతజయంతి వేడుకల కమిటీ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు శ్రీ కె. కేశవరావు తెలియజేశారు. గురువారం బిఆర్ కెఆర్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో కమిటీ చైర్మన్ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ శతజయంతి వేడుకల ఏర్పాట్ల పై సమీక్షించారు. శత జయంతి వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్, జిఏడి ముఖ్యకార్యదర్శి శ్రీ వికాస్ రాజ్, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ అంజనీకుమార్, ప్రొటోకాల్ డైరెక్టర్ శ్రీ అర్విందర్ సింగ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

* ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో శ్రీమతి వైఎస్‌ షర్మిల రేపు (25–06–2021) పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు లోటస్‌పాండ్‌ నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. కరోనా కారణంగా ఇటీవల మరణించిన పలు కుటుంబాలను పరామర్శిస్తారు. చేనేత కార్మికులను కూడా కలుసుకొని వారి కష్టాలు తెలుసుకొని భరోసానివ్వనున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి అభిమానులు, ఆ కుటుంబ ఆత్మీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్‌ షర్మిల గారి పర్యటనను విజయవంతం చేయాలని మనవి.

* జులై 31 లోగా ఇంటర్మీడియట్ ఫలితాలను వెల్లడించాల్సిందిగా అన్ని రాష్ట్రాల ఇంటర్ బోర్డులను సుప్రీం కోర్టు ఆదేశించింది. అందుకు పది రోజుల్లోగా ఇంటర్నల్ అసెస్ మెంట్ పూర్తి చేయాలని సూచించింది. కాగా, ఈ నెల మొదటి వారంలో విద్యార్థుల మార్కులకు సంబంధించి ప్రత్యామ్నాయ పద్ధతులను పరిశీలించాల్సిందిగా సీబీఎస్ఈ, సీఐఎస్ సీఈలను సుప్రీం కోర్టు ఆదేశించింది. అన్ని రాష్ట్రాల బోర్డుల మాదిరే సీబీఎస్ఈ, సీఐఎస్ సీఈ కూడా జులై 31లోగా ఫలితాలను వెల్లడించాలని పేర్కొంది.