Devotional

TTD స్పెసిఫైడ్ అథారటీ ఛైర్మన్‌గా జవహరరెడ్డి-ఆధ్యాత్మిక వార్తలు

TTD స్పెసిఫైడ్ అథారటీ ఛైర్మన్‌గా జవహరరెడ్డి-ఆధ్యాత్మిక వార్తలు

* టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మ‌న్‌గా డాక్ట‌ర్ కెఎస్.జ‌వ‌హ‌ర్‌రెడ్డి గురువారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద జ‌రిగిన కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి వారి చేత ప్ర‌మాణం చేయించారు. అనంత‌రం టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ క‌న్వీన‌ర్‌గా శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేశారు. టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్.జ‌వ‌హ‌ర్‌రెడ్డి వారి చేత ప్ర‌మాణం చేయించారు. ఆ త‌రువాత ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో జ‌రిగిన జ్యేష్టాభిషేకంలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌పంలో టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మ‌న్‌ డాక్ట‌ర్ కెఎస్.జ‌వ‌హ‌ర్‌రెడ్డికి, క‌న్వీన‌ర్‌ శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం అంద‌జేశారు. శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు అందించారు.

* ఒడిశాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరీలో దేవస్నాన పూర్ణిమ వైభవంగా జరిగింది. దేవతా మూర్తులైన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ప్రతిమలకు స్నానఘట్టం నిర్వహించారు.

* హనుమంత వాహనంపై శ్రీ కోదండ‌ రాముడి అభయం. అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ కోదండ‌ రాముడై హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు.

* ముగిసిన తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి తెప్పోత్స‌వాలు.తిరుచానూరులో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు గురువారం ముగిశాయి.కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు.ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు.మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల‌ వరకుశ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఉత్స‌వ‌మూర్తికి అభిషేకం నిర్వహించారు.ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్లు, ప‌సుపు, చందనంల‌తో అభిషేకం చేశారు. అనంత‌రం సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారికి ఊంజ‌ల్ సేవ నిర్వ‌హించ‌నున్నారు.

* ఎస్వీ వేద వ‌ర్సిటీలో శాస్త్రోక్తంగా శ్రీ వ‌టసావిత్రి వ్ర‌తం లోక కల్యాణార్థం టిటిడి నిర్వ‌హిస్తున్న జ్యేష్ఠ మాస పూజా కార్య‌క్ర‌మాల్లో భాగంగా గురువారం తిరుప‌తి శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విశ్వ‌విద్యాల‌యంలో శ్రీ వ‌ట సావిత్రి వ్ర‌తం శాస్త్రోక్తంగా జ‌రిగింది.వ‌ర్సిటీలోనిశ్రీ మ‌హావిష్ణువు యాగ‌శాల‌లో ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.పురాణాల ప్ర‌కారం మ‌ర్రిచెట్టు నీడ‌లో త్రిమూర్తుల‌తో పాటు అధిదేవ‌త‌గా పూజ‌లందుకునే సావిత్రిదేవిని ఆరాధిస్తే స‌క‌ల శుభాలు చేకురుతాయి.