DailyDose

అత్తపై కాగుతున్న నూనె పోసిన కృష్ణా జిల్లా కోడలు-నేరవార్తలు

అత్తపై కాగుతున్న నూనె పోసిన కృష్ణా జిల్లా కోడలు-నేరవార్తలు

* శ్రీకాకుళం..కవిటి బీచ్ లో నలుగురు యువకుల గల్లంతు.ఇద్దరు మృతదేహాలను బయటకు తీసిన మత్స్యకారులు. మిగతా ఇద్దరి యువకుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు.వీరంతా బొర్ర పుట్టుగ గ్రామానికి చెందిన యువకులుగా గుర్తింపు.

* తిరుపతిలోని కేవిబిపురం మండలంలో నకిలీ నోట్ల కలకలం రేగింది. తమిళనాడుకు చెందిన దంపతులు… కొత్తూరుకు చెందిన మునిరెడ్డికి 10 నకిలీ నోట్ల అంటగట్టి రెండు మేకలను కొనుగోలు చేశారు.నకిలీ నోట్లని గుర్తించిన మునిరెడ్డి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకుని మేకలను స్వాధీనం చేసుకున్నారు.అలాగే నకిలీ నోట్లపై విచారణ చేపట్టారు.

* గుడివాడ మందపాడులో అత్తా, కోడళ్ల వార్ తన డబ్బులు తనకు ఇవ్వలేదని అత్తపై కోడలు హత్యాయత్నం.నిద్రిస్తున్న సమయంలో అత్తపై కాగిన నూనె పోసిన కోడలు స్వరూప.గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్త లక్ష్మీ.కొడుకు చుక్కా శివ నారాయణ, కోడలు లక్ష్మీలను అదుపులోకి తీసుకున్న గుడివాడ 2 టౌన్ పోలీసులు.

* కృష్ణాజిల్లా నందిగామ మండలం మునగచర్ల జాతీయ రహదారిపై లారీని ఢీ కొట్టి బోల్తా పడిన టెంపోవాహనం.

* 5 నిమిషాల వ్యవధిలో జంట పేలుళ్లు.జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుళ్ల కలకలం రేగింది.5నిమిషాల వ్యవధిలో జమ్ము విమానాశ్రయంలో జంట పేలుళ్లు సంభవించాయి.పేలుడు ధాటికి విమానాశ్రయం భవనంపైకప్పు ఎగిరిపడింది.పేలుళ్ల వల్ల ప్రాణనష్టమేమీ జరగలేదని అధికారులు తెలిపారు.బాంబు స్క్వాడ్‌, ఫొరెన్సిక్‌ బృందాలు ఘటనాస్థలిని పరిశీలించాయి.పేలుళ్లకు రెండు డ్రోన్లు ఉపయోగించినట్లు అధికారులు భావిస్తున్నారు.పేలుడు ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఆరా తీశారు. వైస్‌ ఎయిర్‌ చీఫ్‌ అరోరాతో రాజ్‌నాథ్‌ మాట్లాడారు.

* గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీకలవాగులో గల్లంతైన బాలుడి ఆచూకీ లభ్యమైంది.సంపత్‌నగర్ సమీపంలో బాలుడు మృతదేహం లభ్యమైంది.గత రాత్రి మెడికల్ క్లబ్ వద్ద పీకలవాగులో పడి బాలుడు వెంకటేష్(5) గల్లంతయ్యాడు.విషయం తెలిసిన మేయర్ మనోహర్, మునిసిపల్ కమిషనర్ అక్కడకు చేరుకుని ఎన్డీఆర్ఎఫ్, మున్సిపల్ సిబ్బందితో రాత్రంతా గాలింపు చేపట్టగా బాలుడి మృతదేహం లభ్యమైంది.దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

* గన్నవరం RTC బస్టాండ్ లో షాపు యజమాని పై దౌర్జన్యం చేసి దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు..షాపు యజమాని ని వివరణ కోరగా గత కొంత కాలంగా గన్నవరం RTC బస్ స్టాండ్ మామూళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పలు మార్లు గొడవ పడ్డారు.ఇక్కడ వ్యాపారం చేసుకోవాలంటే మామూళ్లు కట్టాలంటూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కేవలం అతను స్థానిక నాయకులు, నియోజకవర్గ స్థాయి పాలకుల అండదండలు పుష్కలంగా ఉండడం వలన అతను ఆడిందే ఆట పాడిందే సాగుతోంది అని వాపోయాడు.ఇదంతా కేవలం రాజకీయ బడా బాబుల అండ చూసుకుని ఇలా చేస్తున్నారు అంటూ వాపోయాడు.ఇదంతా గన్నవరం RTC డిపో మేనేజర్ నాగభూషణం గారు కావాలనే నా మీద దాడి చేయించాడు అని నాకు ప్రాణ హాని ఉంది అని నాకు రక్షణ కల్పించాలని పసుపు లేటి సీతారామయ్య (షాప్ యజమాని) తెలియచేశారు.