Movies

KGF-2 కోసం క్రిస్మస్ వరకు ఆగాల్సిందే

KGF-2 కోసం క్రిస్మస్ వరకు ఆగాల్సిందే

‘కేజీఎఫ్‌-2’ విడుదల గురించి సోషల్‌మీడియాలో కొన్ని పోస్టులు దర్శనమిస్తున్నాయి. సెప్టెంబర్‌ 9న ‘కేజీఎఫ్‌-2’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. ఈ మేరకు చిత్రనిర్మాతలు భారీగా సన్నాహాలు చేస్తున్నారని సినీవర్గాల సమాచారం. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం రిలీజ్‌ డేట్‌ గురించి వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా, అన్ని సక్రమంగా ఉంటే అక్టోబర్‌లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని.. అలా కాని పక్షంలో క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశాలున్నట్టు సినీవర్గాల భోగట్టా. ఒకవేళ అదే కనుక నిజమైతే అభిమానులు మరికొంతకాలం వేచి ఉండాల్సిందే. ‘కేజీఎఫ్‌-1’ సైతం 2018లో క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 21న విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.