DailyDose

₹300కోట్లు ఎగ్గొట్టిన వైకాపా ఎంపీ సంస్థ-నేరవార్తలు

₹300కోట్లు ఎగ్గొట్టిన వైకాపా ఎంపీ సంస్థ-నేరవార్తలు

* రాంకీ సంస్థలో జరిగిన సోదాలపై ప్రెస్ నోట్ విడుదల చేసిన ఐటీశాఖ .వైసీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి చైర్మన్ గా కొనసాగుతున్న సంస్థ .రాంకీ సంస్థ ఉద్దేశపూర్వకంగానే నష్టాలను చూపెట్టింది .రూ.1200 కోట్లు కృతిమ నష్టాన్ని రాంకీ చూపించింది రాంకీలో మేజర్ వాటాను సింగపూర్‌కు చెందిన వ్యక్తులకు అమ్మేశారు .తప్పుడు లెక్కలు చూపెట్టి రూ.300 కోట్లు పన్ను ఎగ్గొట్టేందుకు యత్నం .రూ.288 కోట్లకు సంబంధించిన పత్రాలను సంస్థ నాశనం చేసింది .రాంకీ దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లతో పాటు వేస్ట్ మేనేజ్‌మెంట్ వాటిలో ప్రాజెక్టు చేపట్టింది .లెక్కలేని రూ.300 కోట్ల నగదు లావాదేవీలను గుర్తించాం : ఐటీ

* జమ్ముకశ్మీర్‌ రాజోరి జిల్లాలోని సుందర్‌బాని సెక్టార్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ సైనికుడు మనుప్రోలు జశ్వంత్‌రెడ్డి(23) వీరమరణం పొందారు.

* కార్వేటినగరం….బ్రేకింగ్.👉విషగుళికలు సేవించి మహిళ ఆత్మహత్య.👉 చిత్తూరు జిల్లా, కార్వేటినగరంలోని అలత్తూరు ఘటన .👉భార్య భర్త ల మధ్య మనస్పర్థల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల వెల్లడి.👉 ఈ నెల 7న విషగుళికలు తీసుకోవడంతో చికిత్సకోసం తిరుపతి రుయా ఆస్పత్రి కి తరలించిన కుటుంబ సభ్యులు.👉 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కార్వేటినగరం ఎస్ ఐ దస్తగిరి.

* గుంటూరు జిల్లా దుర్గి మండలం తహసిల్దార్ కార్యాలయంలో ACB దాడులు.కంచరగుంట గ్రామానికి చెందిన బాల సైదారావు అనే రైతు పొలం అడంగల్ లో నమోదు చేసేందుకు 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన VRO రాజారావు.అతని ప్రవేట్ అసిస్టెంట్ నాగమణి లంచం అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు వెల్లడి.