Politics

కేటీఆర్‌పై షర్మిల కామెడీ-తాజావార్తలు

కేటీఆర్‌పై షర్మిల కామెడీ-తాజావార్తలు

* ప్రకృతి పరిరక్షణ ప్రజాఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉందని భారత గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.

* తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం నాడు మీడియా మీట్ నిర్వహించిన ఆమె.. కేటీఆర్ గురించి విలేకరులు ప్రశ్నించగా అసలు కేటీఆర్ అంటే ఎవరు..? అని విలేకరులనే రివర్స్ ప్రశ్నించారు.ఆ తర్వాత పక్కనుండే మరో నేత ఆయనే మేడమ్.. సీఎం కేసీఆర్ కొడుకు కల్వకుంట్ల తారకరామారావు అని చెప్పగా షర్మిల నవ్వుకున్నారు.అనంతరం ప్రెస్‌మీట్ కొనసాగించిన ఆమె మహిళలకు కేబినెట్‌లో ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రశ్నించారు.కేటీఆర్ గారి దృష్టిలో మహిళలు అంటే వంటింట్లో ఉండాలి.. వ్రతాలు చేసుకోవాలనేగా అర్థం.. అంతేనా..?.అధికార పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడైనా మహిళలు కనిపిస్తారా..?.నిరుద్యోగుల కోసం అన్నం మెతుకు ముట్టుకోకుండా మేం వ్రతం చేస్తున్నాం.

* మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితులను విచారిస్తున్నారు.

* ఏపీలో 1184 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్. ఆగస్టులో కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం.

* టీఆర్‌ఎస్‌లో చేరిన ఎల్‌.రమణ.. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్.

* తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం, .చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం ఎవరినైనా ఎదిరిస్తా. ఎంత దూరమైనా వెళ్తా అని తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

* ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి చేదు అనుభవం.విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి చేదు అనుభవం ఎదురైంది.కుందావారి కండ్రికలో వైఎస్​ఆర్​ రైతు భరోసా చైతన్యయాత్రల సభలో పాల్గొన్న ఆయనను.. స్థానిక రైతులు నిలదీశారు.ధాన్యం కొనుగోలు చేసి 3 నెలలైనా ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడికి డబ్బులు లేక ఖరీఫ్‌లో పంటలు వేయలేదని గోడు వెల్లబోసుకున్నారు.ధాన్యం బకాయిల చెల్లింపుల్లో జాప్యం వాస్తవమేనన్న ఎమ్మెల్యే.. నెల రోజులలో ఖాతాలకు నగదు జమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.

* జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు తమ పార్టీ బాసటగా నిలిచి పోరాటం చేస్తుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఈనెల 20న అన్ని జిల్లాల్లోని ఉపాధి కల్పన అధికారులకు వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలను జాబ్‌ క్యాలెండర్‌లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో వైకాపా చెప్పిన మాటలు నమ్మిన నిరుద్యోగ యువత జాబ్‌ క్యాలెండర్‌లో చూపించిన ఖాళీలతో నిరాశ చెందిందన్నారు. గత రెండేళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం, అందుకు సంబంధించిన పోటీ పరీక్షల కోసం యువత ఎన్నో కష్టాలు ఓర్చుకొని సిద్ధమవుతున్నారని తెలిపారు.

* దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నప్పటికీ పలు రాష్ట్రాలు టీకా కొరతను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంటున్నాయి. దీంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగంగా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 66 కోట్ల డోసుల కోసం ఆర్డర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.14 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం చెల్లించనుంది. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు 40 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేయగా.. త్వరలోనే వీటి సంఖ్యను గణనీయంగా పెంచేందుకు కృషిచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

* విజయవాడ ఏసీపీ శ్రీనివాసరావుకు ఏపీ హైకోర్టు వారం రోజుల పాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ కేసులో ఛార్జిషీట్‌ వేయాలని విజయవాడ ఏసీపీని గతంలో హైకోర్టు ఆదేశించింది. ఆదేశాలు అమలు చేయకుండా తమను తప్పుదోవ పట్టించారన్న హైకోర్టు .. ఏసీపీకి వారం పాటు జైలుశిక్ష విధించింది. ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనతో తీర్పు అమలు హైకోర్టు వారంపాటు వాయిదా వేసింది.