Movies

ఎన్నాళ్లు బాహుబలిని సాగదీస్తారు? నయనతారతో మరో సిరీస్.

ఎన్నాళ్లు బాహుబలిని సాగదీస్తారు? నయనతారతో మరో సిరీస్.

తెలుగు సినీఖ్యాతిని ప్రపంచ నలుదిశలకు వ్యాపింపజేసిన బ్లాక్‌ బస్టర్‌ ‘బాహుబలి’. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడా చిత్రానికి ప్రీక్వెల్‌ రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ ‘బాహుబలి: బిఫోర్‌ ది బిగినింగ్‌’ పేరుతో ప్రీక్వెల్‌ని వెబ్‌సిరీస్‌ రూపంలో విడుదల చేయనున్నట్లు ఎన్నో రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కాగా, తాజా సమాచారం ప్రకారం మహిష్మతి సామ్రాజ్యం ఎలా ఏర్పడింది? అసలు శివగామి ఎవరు? వంటి కీలక అంశాల ఆధారంగా తొమ్మిది ఎపిసోడ్లతో ఈ సిరీస్‌ రూపొందించనున్నారట. బాలీవుడ్‌ నటి వామికా గబ్బి శివగామి పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈ ప్రీక్వెల్‌లో కోలీవుడ్‌ లేడీ సూపర్‌స్టార్‌ నయనతార కీలకపాత్రలో కనిపించనున్నారని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే, ఆమె ఏ పాత్రలో కనిపించనున్నారు? ఆమె పాత్ర ఇతివృత్తం ఏమిటి? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు.