NRI-NRT

Alert: నైజీరియా నుండి డల్లాస్‌కు మంకీపాక్స్

Alert: నైజీరియా నుండి డల్లాస్‌కు మంకీపాక్స్

మెరికాలో దాదాపు 20 ఏళ్ల తర్వాత తొలిసారి ఓ అరుదైన వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఇటీవల నైజీరియా వెళ్లి వచ్చిన ఓ వ్యక్తికి ‘మంకీపాక్స్‌’(Monkeypox) సోకిందని ‘వ్యాధి నియంత్రణా, నివారణ కేంద్రం(సీడీసీ)’ తెలిపింది. ప్రస్తుతం సదరు వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. అలాగే ఆ వ్యక్తి ప్రయాణించిన విమానంలో ఇతర ప్రయాణికుల్ని గుర్తించి వారిని కూడా అప్రమత్తం చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఒక్క కేసే వెలుగులోకి వచ్చిందని.. దీని వల్ల సామాన్య ప్రజానీకానికి పెద్ద ప్రమాదమేమీ లేదని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. చివరిసారి 2003లో 47 మందికి మంకీపాక్స్ వచ్చినట్లు వెల్లడించారు. గత నెల జూన్‌లో బ్రిటన్‌లోనూ నాలుగు మంకీపాక్స్‌ కేసులు వెలుగులోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి.

https://www.dallasnews.com/news/public-health/2021/07/16/dallas-resident-has-states-first-ever-case-of-monkeypox-officials-say/