Agriculture

గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ

గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తుతున్నది. నదిలో నీటిమట్టం గంట గంటకూ పెరుతున్నది. శనివారం సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇండ్లలోకి వరద నీరు చేరే వరకు వేచిచూడకుండా తక్షణమే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ముంపు బాధితులను కోరారు. ప్రజలంతా అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి పరవళ్లు తొక్కుతుండటంతో వరద నీరు పర్ణశాలను చుట్టుముట్టింది. పర్ణశాలలోని సీతమ్మ విగ్రహం, నారచీరల ప్రాంతం పూర్తిగా నీటమునిగాయి. కేవలం 24 గంటల వ్యవధిలో నది నీటిమట్టం 20 అడుగులకుపైగా పెరిగింది. ప్రవాహం ఇలానే కొనసాగితే 60 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.