Politics

మతి చెదరగొడుతున్న గుంటూరు జిల్లా ఎమ్మెల్యే PA అక్రమాలు-నేరవార్తలు

* గుంటూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే PAల లీలలు. ఎమ్మెల్యే కి తెలియకుండా భారీగా కూడబెట్టిన ఆస్తులు. గిఫ్టుగా భార్యకి 60 సేవర్ల బంగారం,తన అక్క పేరు మీద డబల్ బెడ్రూమ్ ప్లాట్ కోన్న ఎమ్మెల్యే PA. మరో రాజకీయ నేతకి పీఏ 23 లక్షలు ఇచ్చినట్లు సొంత పార్టీ లొనే ప్రచారం….ఎమ్మెల్యే కి తెలియకుండా అతని పేరు మీద మూడు చోట్ల పేకాట డెన్లు, ఇల్లీగల్ వ్యవహారం నడిపిన PA. విషయం తెలిసి బిత్తరపోయిన ఎమ్మెల్యే! పెళ్లి చేసుకుంటానని నమ్మించి నరసరావుపేటలోని ఓ అమ్మాయికి మరో PA వల. ఇద్దరు పీఏలను విధుల నుండి తొలగించి ఇంటికి పిలిచి చితకబాదిన ఎమ్మెల్యే…..తన ఇద్దరు PA ల అక్రమాలపై అత్యంత గోప్యంగా విచారణ జరిపించాలని ఓ పోలీస్ అధికారికి హుకుం. జిల్లా లో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యే ఇద్దరు PAల అవినీతి బాగోతం….నమ్మించి మోసం చేశారని తన సమీప బంధువుల వద్ద తీవ్ర మనస్తాపం చెందిన ఎమ్మెల్యే. పది రోజుల క్రితం సొంతూరుకి పారిపోయిన ఒక PA.

* జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రాత్రి కురిసిన వర్షానికి పూరి గుడిసె గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అయిజ మండలం కొత్తపత్తిలో ఓ కుటుంబం పూరి గుడిసెలో నిద్రిస్తుండగా వర్షానికి నానిన గోడ రాత్రి సమయంలో ఒక్కసారిగా కూలింది. దీంతో గోడ పక్కనే నిద్రిస్తున్న కుటుంబ యజమాని మోష, భార్య శాంతమ్మ, పిల్లలు చరణ్, తేజ, రాము అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

* నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఓ షాపింగ్‌మాల్‌ వద్ద అపహరణకు గురైన మూడేళ్ల చిన్నారి క్షేమంగా ఉందని పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని నర్సీ ప్రాంతంలో కిడ్నాపర్లు పాపను వదిలి వెళ్లారు. పాపను గుర్తించిన పోలీసులు నిజామాబాద్‌ తీసుకొస్తున్నారు. మహారాష్ట్ర పోలీసుల సహకారంతో కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛేదించారు.

* ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ వివరాల ప్రకారం..సికింద్రాబాద్‌ మౌలాలి హెచ్‌బీకాలనీకి చెందిన వి.శ్రీకాంత్‌(49) బెంగళూరులోని కాగ్నిజెంట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. 2007లో వివాహమైన మూడు నెలలకే అతను మధుమేహంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న భార్య అతడిని వదిలి వెళ్లిపోయింది. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్న శ్రీకాంత్‌ మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 3న నగరానికి వచ్చిన శ్రీకాంత్‌ డైమండ్‌ పాయింట్‌ చౌరస్తాలోని అతిథి గెస్ట్‌హౌజ్‌లో ఉంటున్నాడు. బంధువు శ్రీనివాస్‌ భోజనం తెస్తున్నారు. రోజులాగే శ్రీనివాస్‌ శనివారం మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చాడు. ఎంత తట్టినా శ్రీకాంత్‌ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి నిర్వాహకులకు విషయం చెప్పాడు. వారు వచ్చి తలుపులు తెరిచి చూసేసరికి శ్రీకాంత్‌ అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. 108 సిబ్బంది శ్రీకాంత్‌ను పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. శ్రీకాంత్‌ మృతిపై అనుమానం వ్యక్తంచేస్తూ అతని తమ్ముడు నవీన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.