Business

సజ్జనార్ సూపర్ ఐడియా…కేసీఆర్ కొత్త బాదుడు-వాణిజ్యం

సజ్జనార్ సూపర్ ఐడియా…కేసీఆర్ కొత్త బాదుడు-వాణిజ్యం

* తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది.వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని, అప్పుల్లో కూరుకుపోయిన డిస్కంలను ఆదుకునేందుకు ప్రజలపై భారం మోపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే బ్యాంకులు తీసుకున్న అప్పులను ఆర్టీసీ తీర్చలేక అష్టకష్టాలు పడుతోంది.ఈ నేపథ్యంలో ఛార్జీలు పెంచుకునేందుకు ఈ రెండు సంస్థలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.వచ్చేవారంలో ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రకటన చేసే అవకాశం ఉంది.ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలను పెంచింది.ఇప్పుడు మరోసారి ఆర్టీసీ ఛార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.అసలే ఒకవైపు పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, నిత్యావసర ధరలతో అల్లాడుతున్న ప్రజలు..ఇప్పుడు ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల భారంతో వాళ్లు మరింత ఇబ్బందుల పాలయ్యే అవకాశం కనిపిస్తోంది.

* రూ. 100తో 24 గంటలు ప్రయాణించండి||◆ తెలంగాణ ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ఎండీ వీసీ సజ్జనార్ నడుం బిగించారు.◆ నష్టాల్లో కొనసాగుతున్న ఆర్టీసీని లాభాల బాట పట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎండీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత..సంస్థల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.◆ బస్సుల్లో సాధారణ ప్రయాణీకుడిలా ప్రయాణించి…సమస్యలు తెలుసుకోవడం..బస్టాండుల్లో అకస్మిక తనిఖీలు చేయడం…పలు ఆదేశాలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.◆ ఆర్టీసీ ఎండీగా వినూత్నంగా నిర్ణయాలు తీసుకుంటూ..అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఆర్టీసీని సంస్థను లాభాల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తూనే…◆ ప్రయాణీకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్న సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.◆ కేవలం రూ. 100 చెల్లించి..హైదరాబాద్ లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ఓ ప్రకటనలో వెల్లడించారు.◆ పెరుగుతున్న పెట్రోల్ ధరల క్రమంలో..ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలు పెరిగాయని ప్రజలు ఆందోళన చెందవద్దని..ఆర్టీసీ బస్సులు ఉన్నాయంటూ వెల్లడించారు.◆ టీ 24 పేరిట 24 గంటల పాటు చెల్లుబాటు అయ్యేలా టికెట్ ను రూపొందించడం జరిగిందని తెలిపారు.◆ ఈ టికెట్ ధర రూ. 100గా ఉందని..ఈ టికెట్ ను తీసుకుని…ఆర్డినరీ, సబ్ ర్బన్, మెట్రో ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించవచ్చన్నారు.◆ ఈ బస్సుల్లో 24 గంటల వ్యవధిలో ఎంత దూరమైనా ప్రయాణం చేయవచ్చని ఆయన సూచించారు. దీనివల్ల ప్రయాణీకులకు మరింత సౌకర్యం కల్పించినట్లవుతుందని భావిస్తున్నారు.

* క్యాబ్‌ సర్వీసుల సంస్థ ఓలా సరకుల డెలివరీ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. తాజాగా బెంగళూరులో ‘ఓలా స్టోర్‌’ పేరిట పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభించింది. నిత్యావసర సరకులు, పర్సనల్ కేర్‌, పెట్‌ కేర్ వంటి వస్తువులు అందించనుంది. ప్రస్తుతం బెంగళూరులోని కీలక ప్రాంతాల్లో మాత్రమే ప్రారంభమైన ఈ సేవలు త్వరలో ఇతర ప్రధాన నగరాలకూ విస్తరించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 15 నిమిషాల్లో సరకులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నాయి. ఓలా యాప్‌లోనే ఓలా స్టోర్‌ సేవలు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ కేటగిరీల్లో మొత్తం 2,000 సరకులు అందిస్తున్నట్లు సమాచారం. అయితే, ఇప్పటి వరకు దీనిపై ఓలా ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

* ఆక‌ర్ష‌ణీయ వ‌డ్డీరేట్ల‌కే కేంద్ర ప్ర‌భుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ (పీఎన్బీ) వివిధ రుణాలు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఐదు బేసిక్ పాయింట్లు త‌గిస్తున్న‌ట్లు తెలిపింది. దీంతో మ‌రింత చౌక‌ వ‌డ్డీరేటుకే ఇండ్ల రుణాలు, కార్ల రుణాలు ఇస్తున్న‌ట్లు పేర్కొంది. పండుగ‌ల సీజ‌న్‌లో వివిధ‌ రుణాలు మ‌రింత చౌక‌గా అంద‌జేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ నెల 8 నుంచి కార్లను కొనుగోలు చేసే వారికి 6.65 శాతం వ‌డ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నామ‌ని పీఎన్బీ తెలిపింది. ఎల‌క్ట్రిక్‌, సీఎన్జీ కార్లపై 6.65 శాతం వ‌డ్డీకే రుణ‌లిస్తామ‌ని పేర్కొంది. ఇక 6.50 శాతం వ‌డ్డీరేటుకే ఇండ్ల రుణాలిస్తామని వెల్ల‌డించింది. పండుగ‌ల సీజ‌న్‌లో క‌స్ట‌మ‌ర్ల నుంచి వ‌స్తున్న డిమాండ్‌ను అందుకునేందుకు వ‌డ్డీరేట్లు ఐదు బేసిక్ పాయింట్లు త‌గ్గించి 8.90 శాతం వ‌డ్డీకి వ్య‌క్తిగ‌త రుణాలు ఇవ్వ‌నున్నామ‌ని పీఎన్బీ వివ‌రించింది. 72 నెల‌ల గ‌డువుతో రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాలిస్తామ‌ని తెలిపింది. డిజిట‌ల్ చానెల్స్ నుంచి రుణాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి ఇండ్ల రుణాల‌పై అద‌నంగా ఐదు బేసిక్ పాయింట్లు, కార్ల‌ రుణాల‌పై 10 బేసిక్ పాయింట్ల వ‌డ్డీ త‌గ్గిస్తున్నామ‌ని వెల్ల‌డించింది. ఇంట‌ర్నెట్ బ్యాంక్‌, పీఎన్బీ వ‌న్ మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి ఈ మిన‌హాయింపులు వ‌ర్తిస్తాయ‌ని పేర్కొంది. ఇంకా ఇండ్ల రుణాలు, వాహ‌న రుణాలు, వ్య‌క్తిగ‌త రుణాలు, ఆస్తి రుణాల‌పై ప్రాసెసింగ్ ఫీజు, స‌ర్వీస్ చార్జీల నుంచి మిన‌హాయింపు ఇస్తున్న‌ట్లు పీఎన్బీ తెలిపింది.

* ముడి చ‌మురు ఉత్ప‌త్తి చేసే గ‌ల్ఫ్ దేశాల్లో ఒక‌టైన యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ) తాజాగా ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ది. వ్య‌ర్థాల‌తో ఎడారులు నింప‌కుండా స‌ద‌రు వ్య‌ర్థాల‌ను విద్యుత్ ఉత్ప‌త్తి కోసం ఉప‌యోగించ‌నున్నది. వ్య‌ర్థాల‌ను విద్యుత్ ఉత్ప‌త్తి కోసం వినియోగించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న తొలి గ‌ల్ఫ్ దేశంగా యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ). ఈ నిర్ణ‌యంతో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ సంస్థ‌లు ఏకీభ‌వించ‌ట్లేదు. వ్యర్థాల‌తో ఉత్ప‌త్తి చేసే గ్రీన్‌హౌస్ గ్యాస్ ఇంటెన్సివ్‌తో ప‌ర్యావ‌ర‌ణ ముప్పు పొంచి ఉంద‌ని ప‌ర్యావ‌ర‌ణ ప‌రిరక్ష‌ణ సంస్థ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. కానీ వ్య‌ర్థాల విలువ స‌ద‌రు ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ సంస్థ‌ల‌కు తెలియ‌ద‌ని వేస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీ బీయాహ్ ఇంజినీర్ నౌవ్ వాజిర్ చెప్పారు. ఈ ఏడాదిలో షార్జాలో వ్య‌ర్థాల నుంచి విద్యుత్ ఉత్పాద‌క యూనిట్ ప్రారంభం కానుంది.