Movies

చిరంజీవి చెల్లెలి పాత్రలో నయనతార. పారితోషికం విని అదిరిపడిన ఇండస్ట్రీ.

అగ్ర కథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ డ్రామా ‘గాడ్‌ ఫాదర్‌’. మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘లూసిఫర్‌’ రీమేక్‌గా ఈ సినిమా సిద్ధం కానుంది. ఈ సినిమాలో ఎంతో కీలకంగా ఉండే హీరో సోదరి పాత్రను తెలుగులో నయనతార పోషిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా కోసం నయన్‌ తీసుకున్న పారితోషికంపై అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే.. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా రూ.4 కోట్లు తీసుకున్నారని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయనతార రోల్‌ ఎంతో కీలకంగా ఉండనుందట. మునుపెన్నడూ లేనివిధంగా ఆమె పవర్ ఫుల్‌ లుక్‌లో కనిపించనున్నారట.