Health

TNI కోవిడ్ బులెటిన్ – మూడో విడత తప్పదా

TNI  కోవిడ్  బులెటిన్ – మూడో విడత తప్పదా

1. ఇండియాలో కొత్తగా 58,097 కరోనా కేసులు ..థర్డ్ వేవ్ తప్పదా ?
ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు మళ్ళీ ఎగిసిపడుతున్నాయి. మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు 50 వేలు క్రాస్ చేశాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 58,097 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,14,004 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది.ఇక దేశంలో తాజాగా 534 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,82,551 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15,389 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,43,21,803 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 147.72 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే ఇండియాలో రోజు వారి పాజిటి విటీ రేటు 4.18% కు చేరింది. అటు ఓమిక్రాన్ కేసులు కూడా విపరీతంగా పెరుగు తున్నాయి.

2. ఓం అరుణాచలేశ్వరాయ నమః.. ఈ వారం లో కోవిడ్ కారణంగా శుక్ర శని ఆది వారాలు అరుణాచలం లో ఉన్న ఆలయాలు మూసివేయబడి ఉంటాయి .అలాగే తమిళనాడు లో దేవాలయాలు అన్నీ ఈ మూడు రోజులు శుక్ర,శని, ఆది వారాలు మూసివేయబడి ఉంటాయి.(ప్రస్తుతం సమాచారం)

3. ఒమైక్రాన్‌కూ కవరేజి ఆరోగ్య బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ ఆదేశాలు
ఒమైక్రాన్‌ చికిత్సకు అయ్యే వ్యయాలకు కూడా కొవిడ్‌ ఆరోగ్య బీమా పాలసీలు జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఆరోగ్య బీమా కంపెనీలు జారీ చేసే ఆరోగ్య పాలసీలు కవరేజి ఇస్తాయని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ప్రకటించింది. దేశంలో ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని సాధారణ ఆరోగ్య బీమా సంస్థలకు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపింది. ఒమైక్రాన్‌ కారణంగా పాలసీ హోల్డర్లు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం వస్తే వారికి నగదు రహిత సత్వర సేవలందించేందుకు నెట్‌వర్క్‌ ఆస్పత్రులతో సమన్వయానికి ఒక సమర్థవంతమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని బీమా కంపెనీలకు సూచించింది.

4. దిల్లీకి ఇది ఐదో వేవ్‌.. ఈ రోజు 10 వేల కేసులు రావొచ్చు..!
దేశ రాజధానిలో ఈ రోజు దాదాపు 10 వేల కరోనా కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్ వెల్లడించారు. పాజిటివిటీ రేటు 10 శాతానికి చేరనుందని అంచనా వేశారు. నిన్న అది 8.3 శాతంగా ఉంది. అలాగే భారత్‌ మూడో వేవ్‌లోకి ప్రవేశించిందన్నారు. దిల్లీకి మాత్రం అది ఐదో వేవ్‌ అని వెల్లడించారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో లక్షణాలు స్వల్పంగా ఉన్నప్పటికీ.. ప్రజలంతా కొవిడ్ నియమాలు తప్పకుండా పాటించాలని సూచించారు. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో 40 శాతం పడకలు కొవిడ్ బాధితుల కోసం రిజర్వ్‌ చేసినట్లు చెప్పారు. అలాగే అన్ని కొవిడ్ పాజిటివ్‌ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపడం సాధ్యం కాదని తెలిపారు. దిల్లీ నుంచి 300-400 నమూనాలు పంపుతున్నామన్నారు.

5. అమితాబ్ బచ్చన్‌ ఇంట్లో కరోనా కలకలం
బాలీవుడ్‌ స్టార్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఇంట్లో మరోసారి కరోనా కలకలం రేగింది. ఇప్పటికే ఇండియాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ముంబైలోని అమితాబ్‌ ఇంట్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా సోకింది. బిగ్‌బీ ఇంట్లో మొత్తం 31 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ఒకరికి పాజిటివ్‌ అని తేలింది. మిగిలిన వారందరికి నెగిటివ్‌ వచ్చింది.

6.ఇక హోం ఐసోలేషన్‌ 7 రోజులే.. మార్గదర్శకాలు సవరించిన కేంద్రం

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతున్న తరుణంలో లక్షణాలు కన్పించని, స్వల్ప లక్షణాలతో బాధపడే కొవిడ్ బాధితులకు హోం ఐసోలేషన్‌ మార్గదర్శకాలను కేంద్రం తాజాగా సవరించింది. స్వీయ నిర్బంధ కాలాన్ని వారం రోజులకు కుదించింది. లక్షణాలు లేని వారు, లేదా స్వల్ప లక్షణాలు ఉన్న కరోనా బాధితులు.. పాజిటివ్‌ వచ్చిన తర్వాత వరుసగా మూడు రోజులు జ్వరం లేకపోతే 7 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని పేర్కొంది. హోం ఐసోలేషన్‌ ముగిసిన తర్వాత మళ్లీ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

* కొత్త మార్గదర్శకాలివే..

* లక్షణాలు లేని/స్వల్ప లక్షణాలు కలిగిన కొవిడ్ బాధితులు కుటుంబసభ్యులకు దూరంగా ఇంట్లో ప్రత్యేక గదిలో ఐసోలేషన్‌లో ఉండాలి. ఆ గదిలో గాలి, వెలుతురు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

* ఎప్పుడూ మూడు లేయర్ల మాస్క్‌ ఉపయోగించాలి. ప్రతి 8 గంటలకోసారి మాస్క్‌ను మార్చుకోవాలి. కనీసం 72 గంటల తర్వాత ఉపయోగించిన మాస్క్‌లను ముక్కలుగా కత్తిరించి పడేయాలి.

* కుటుంబసభ్యులు ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తి దగ్గరకు రావాల్సి వస్తే.. ఇద్దరూ ఎన్‌-95 మాస్క్‌ను ఉపయోగించాలి.

* బాధితులు వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి.

* రోజుకు మూడు సార్లు వేడి నీటితో గార్గిల్‌ చేసుకోవడం, ఆవిరి పట్టడం వంటివి చేయాలి.

* జ్వరం తగ్గకపోతే వైద్యులను సంప్రదించి పారాసిటమాల్‌ ట్యాబ్లెట్లు వేసుకోవాలి.

* శ్వాస స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. జ్వరం, ఆక్సిజన్‌ లెవల్స్‌ను చెక్‌ చేసుకోవాలి.

* చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. తరచూ ముక్కు, నోటిని తాకడం వంటివి చేయకూడదు. బాధితులు ఉంటున్న గదిని శుభ్రంగా ఉంచాలి.

* ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో కరోనా బాధితులు ఉపయోగించే వస్తువులను ఇతరులతో పంచుకోకూడదు.

* బాధితుల అవసరాలను చూసుకునే సంరక్షకులు(కుటుంబసభ్యులు) కూడా జాగ్రత్తలు పాటించాలి. వారి గదికి వెళ్లి వచ్చిన తర్వాత చేతులు, కాళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి.

* బాధితుల వస్తువులను ముట్టుకునేప్పుడు చేతులకు గ్లౌజులు వేసుకోవాలి.

* అవసరమైతే టెలీ-కన్సల్టేషన్‌ ద్వారా వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవాలి.

*హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులు వరుసగా 3 రోజుల పాటు జ్వరం రాకపోతే 7 రోజుల తర్వాత ఐసోలేషన్‌ నుంచి బయటకు రావొచ్చు. అయితే ఆ తర్వాత మాస్క్‌లు తప్పకుండా ధరించాలి. ఇక, హోం ఐసోలేషన్‌ తర్వాత ఎలాంటి కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు.

*హోం ఐసోలేషన్‌ ఎవరికంటే..

కరోనా పాజిటివ్‌ వచ్చినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేదా స్వల్ప లక్షణాలు కన్పించిన వారు స్వీయ నిర్బంధానికి అర్హులు. బాధితుల ఆక్సిజన్‌ స్థాయిలు 93శాతం కంటే ఎక్కువ ఉండి, ఎలాంటి జ్వరం వంటి లక్షణాలు లేకపోతే వైద్యుల ధ్రువీకరణతో హోం ఐసోలేషన్‌లో ఉండొచ్చు. అయితే బాధితుల కుటుంబసభ్యులు కూడా హోం ఐసోలేషన్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలి.

7. ఒమిక్రాన్ పై డబ్ల్యూహెచ్ వో కీలక వ్యాఖ్యలు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ఇప్పుడు ప్రపంచ దేశాలను టెన్షన్‌ పెడుతోంది. అయితే, ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా దాని ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). ఒమిక్రాన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక్కో దేశంలో ఒక్కోలా ఒమిక్రాన్‌ వేరియంట్ ప్రభావం ఉంటుందని పేర్కొన్న డబ్ల్యూహెచ్‌వో. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌తో ఆస్పత్రిపాలయ్యేవారి సంఖ్య చాలా తక్కువని. ఒమిక్రాన్‌ మరణాలు కూడా తక్కువేనని పేర్కొంది. ఇక, ఇప్పటికే ఒమిక్రాన్‌ వేరయంట్ 128 దేశాలకు వ్యాపించిందని చెబుతోంది. ఇక, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికీ COVID-19 రోగులకు 14 రోజుల ఐసోలేషన్‌ను సిఫార్సు చేస్తోంది.

చాలా మంది కోవిడ్‌ బాధితులు ఐదు నుండి ఏడు రోజులలోపు వైరస్‌ నుంచి కోలుకుంటారు. అయితే, రాష్ట్రాలు వారి వ్యక్తిగత పరిస్థితుల ఆధారంగా ఐసోలేషన్‌ వ్యవధిపై నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెబుతోంది.తక్కువ ఇన్‌ఫెక్షన్లు ఉన్న దేశాలలో, ఎక్కువ కాలం ఐసోలేషన్‌తో వీలైనంత తక్కువ కేసులు నమోదు కావడానికి సహాయపడుతుందని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం. డిసెంబర్ 29, 2021 నాటికి, దాదాపు 128 దేశాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ ఊపిరితిత్తుల కంటే ఎక్కువగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందనే పేర్కొంది.

అధిక-ప్రమాదకర వ్యక్తులు మరియు టీకాలు వేసుకోనివారు ఇప్పటికీ ఆ వేరియంట్ నుండి తీవ్ర అనారోగ్యానికి గురువుతున్నారని తెలిపింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కొన్ని వారాల వ్యవధిలో ఇతర జాతులను అధిగమించగలదని చెబుతున్నారు. ప్రత్యేకించి పెద్ద సంఖ్యలో ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూస్తున్న ప్రాంతాల్లో ప్రధానంగా టీకాలు తీసుకోనివారే ఆ మహమ్మారి బారిన పడుతున్నారని తెలిపింది. డెన్మార్క్‌లో ఆల్ఫా వేరియంట్‌ కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి రెండు వారాలు పట్టిందని, అయితే ఒమిక్రాన్ వేరియంట్‌ కేవలం రెండు రోజుల్లోనే విస్తరించిందని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది.

8. సింగరేణిలో తొలి ఒమైక్రాన్ కేసు నమోదు
రాష్ట్రంలో ఒమైక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా జిల్లాలోని సింగరేణిలో తొలి ఒమైక్రాన్ కేసు నమోదు అయ్యింది. రామగుండం రీజియన్‌లోని 3వ డివిజన్‌ ఓసిపిటులో కేసు నమోదు అయ్యింది. ఈపీ ఫిట్టర్‌కు ఒమైక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సింగరేణిలో ఒమైక్రాన్ కేసు నమోదు అవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మిగిలిన కార్మికులకు వైద్య పరీక్షలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒమైక్రాన్ కేసుతో సింగిరేణిలో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు.

9. ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఒకరికి, ప్రకాశం జిల్లాలో ముగ్గురికి కొత్త వేరియంట్‌ను గుర్తించారు యూఎస్‌ఏ నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, విదేశాల నుంచి వచ్చిన మరో మహిళకు ఒమిక్రాన్‌ నిర్ధారణ కాగా మొత్తం రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 28కి చేరుకుంది.మరోవైపు ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. నిన్న 334 మందికి కరోనా సోకగా ఇద్దరు చనిపోయారు. దీంతో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య14, 499కు చేరుకుంది.

10. ఒక్కో దేశంలో ఒక్కోలా ఒమిక్రాన్‌: డబ్ల్యూహెచ్‌వో
కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణుడు డాక్టర్‌ అబ్దీ మహముద్‌ మంగళవారం పేర్కొన్నారు. ఈ వేరియంట్‌ తొలిసారి బయటపడిన దక్షిణాఫ్రికాలో ఆసుపత్రిపాలయ్యే పరిస్థితి, మరణాల రేటు తక్కువగానే ఉందన్నారు. అయితే అన్నిచోట్ల ఇదే తరహాలో ఉంటుందని భావించలేమని చెప్పారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ బారిన పడినవారిలో ఆసుపత్రుల పాలు కావడం చాలా తక్కువని, మరణాలు చాలా చాలా తక్కువని తెలిపారు. అయితే ఇతర దేశాల్లోనూ ఇలాగే ఉంటుందని భావించలేమన్నారు. గతంలో ఎన్నడూలేనంతగా ఒమిక్రాన్‌లో సాంక్రమికశక్తి కనిపిస్తోందని చెప్పారు.

అమెరికాలో కేసులు గణనీయంగా పెరుగుతున్న విషయాన్ని ఆయన ఉటంకించారు. ఇక్కడ ఆసుపత్రుల్లో చేరే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. ఇంతకుముందు వేరియంట్లు ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం చూపగా.. ఒమిక్రాన్‌ శరీర పైభాగంలో ప్రభావం చూపుతున్నట్లు అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయని తెలిపారు. అయితే దీనిపై స్పష్టత రావాలంటే మరిన్ని అధ్యయనాలు అవసరమన్నారు. ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా 128 దేశాల్లో ఒమిక్రాన్‌ కేసులు బయటపడినట్లు డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. అయితే పలుచోట్ల పరీక్షలు జరిపే సామర్థ్యం లేకపోవడం వల్ల ఈ వేరియంట్‌ బయట పడలేదని, అక్కడా కూడా ఉండే అవకాశాలున్నాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.