Devotional

నేటి రాశి ఫలాలు 19-1-2022

నేటి రాశి ఫలాలు

*శుభోదయం* *19.01.2022*

*నేటి రాశి ఫలాలు*

*_మేషం_*మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. *హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.* 

*_వృషభం_* తలచిన కార్యాలు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన, వస్త్రలాభాలు కలవు. *సూర్య నమస్కారం వల్ల మంచి జరుగుతుంది.* 

*_మిధునం_*మీమీ రంగాల్లో లాభదాయక ఫలితాలు సొంతమవుతాయి. దైవబలం అనుకూలిస్తుంది. ఆశయాలు సిద్ధిస్తాయి. కాలం సహకరిస్తోంది. *లక్ష్మీ దేవి సందర్శనం ఉత్తమ ఫలితాలనిస్తుంది.* 

*_కర్కాటకం_* గ్రహబలం తక్కువగా ఉంది.  శ్రమ కాస్త పెరుగుతుంది. మితంగా ఖర్చుచేయాలి. కుటుంబసభ్యులతో ప్రేమగా మెలగాలి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. సమయానికి మంచి భోజనం తీసుకోవాలి. *నవగ్రహ శ్లోకాన్ని  చదవాలి.* 

*_సింహం_*అనుకూల ఫలితాలున్నాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగములలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. *సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.* 

*_కన్య_*చేపట్టే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా అధిగమిస్తారు. మనసు చెడ్డ పనుల మీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అస్థిర నిర్ణయాలతో సతమతమవుతారు. *శని ధ్యానం చేయండి.* 

*_తుల_*వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగములలో అనుకూల ఫలితాలున్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. *ప్రసన్నాంజనేయ స్తోత్ర పారాయణ చేయాలి.* 

*_వృశ్చికం_*మిమి రంగాల్లో విశేషమైన ఫలితాలను సాధిస్తారు. మిమి రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి . ఒక శుభవార్త మీ మనోధైర్యమును పెంచుతుంది. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. *ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.* 

*_ధనుస్సు_*శ్రమకు తగిన ఫలితాలుంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న విషయాలను సాగదీయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. *ఆదిత్యహ్రుదయము పఠించడం మంచిది.*   

*_మకరం_*అదృష్ట ఫలాలు అందుతాయి. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారములు కలిసి వస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. *వేంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభప్రదం.*  

*_కుంభం_*భవిష్యత్ ప్రణాళికలను అమలుచేస్తారు. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. *ఆంజనేయ స్వామి సందర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది.* 

*_మీనం_*శుభ కాలం. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన బుద్ధితో  వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. సకాలంలో సహాయం చేసేవారు ఉన్నారు. *శివారాధన చేయడం మంచిది.*