Business

బీఎండబ్ల్యూ అనూహ్య నిర్ణయం…! i3 ఉత్పత్తి నిలిపివేత.

బీఎండబ్ల్యూ అనూహ్య నిర్ణయం…! i3 ఉత్పత్తి నిలిపివేత.

ప్రముఖ జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్‌ వాహనాల శ్రేణిలోని BMW i3 కార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

***సేల్స్‌ లో తోపు..! అయినా..
ప్రపంచవ్యాప్తంగా బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్‌ వాహనాల్లో BMW i3 అత్యంత ఆదరణను పొందింది. సుమారు రెండున్నర లక్షల BMW i3 యూనిట్లను కంపెనీ సేల్‌ చేసింది. తొమ్మిదేళ్ల BMW i3 ప్రస్థానం జూలై 2022తో ముగియనున్నట్లు తెలుస్తోంది. BMW i3 వాహనాల తయారీని నిరవధికంగా నిలిపేయనుంది. లీప్‌జిగ్ ఫ్యాక్టరీలో BMW i3 వాహనాల ఉత్పత్తికి బదులుగా కొత్త తరం మినీ కంట్రీమ్యాన్‌ను ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఈ కారును కంపెనీ 2011లో లాంచ్‌ చేసింది. ఇదిలా ఉండగా ఈ మోడల్‌ను భారత్‌లో ఇప్పటివరకు ప్రవేశపెట్టలేదు. BMW i3 కారు స్థానంలో BMW iX1 ఎలక్ట్రిక్‌ కారు ఉండనున్నట్లు సమాచారం.

**ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టి..!
బీఎండబ్ల్యూ పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టిసారించింది. 2030 వరకు 50 శాతం ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉత్పత్తి చేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. ఇక భారత ఆటోమొబైల్‌ ఇండస్ట్రీయే లక్ష్యంగా వచ్చే ఆరు నెలల్లో మూడు ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రవేశ పెట్టనుంది. ఇందులో ఇప్పటికే బీఎండబ్ల్యూ ఈవీ ఎస్‌యూవీ ఐఎక్స్‌ను ఆవిష్కరించింది.